Spiritual Tips: ఆడవారికి ఎడమ కన్ను అదరడం మంచిది కాదా.. పండితులు ఏం చెబుతున్నారంటే?

మాములుగా మనకు శరీరంలో అవయవాలు ఆదరడం అన్నది సహాజం. అందులో కళ్ళు కూడా ఒకటి. కాగా చాలా మంది మగవారికి ఎడమ కన్ను అదిరితే మంచిది కాదు.

  • Written By:
  • Publish Date - January 28, 2024 / 09:00 PM IST

మాములుగా మనకు శరీరంలో అవయవాలు ఆదరడం అన్నది సహాజం. అందులో కళ్ళు కూడా ఒకటి. కాగా చాలా మంది మగవారికి ఎడమ కన్ను అదిరితే మంచిది కాదు. ఆడవారికి కుడి కన్ను అదిరితే మంచిది కాదు అని అంటుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మగవారికి ఒకలా, మహిళలకు వేరేలా ఉంటాయి. ఈ క్రమంలోనే ఆడవాళ్లకు ఎడమ కన్ను అదరడం వల్ల ఏం జరుగుతుంది? అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆడవారికి ఎడమ కన్ను అదిరితే కంగారూ పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఎడమ కన్ను అదిరిందంటే త్వరలోనే మీకు సంతోషం, ఆనందం కలిగించే పనులు ఇంట్లో జరుగుతాయి.

అలాగే కొత్త బట్టలు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. లేడీస్‌కు ఎడమ కన్ను అదరడం వల్ల శుభ ప్రదమని జ్యోతిష్యులు అంటారు. ఒక మహిళకు ఎడమ కన్ను అదిరిందంటే వారే ఏవో మంచి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారని అర్థం. అదే విధంగా మహిళలకు ఎడమ కన్ను అదరడం వల్ల కొత్త పనులకు శుభ సూచికమని చెబుతారు. ఎడమ కన్ను అదిరితే మహిళలకు సంతోషానికి, అదృష్టానికి సంబంధించే సంకేతంగా చెప్పవచ్చు. మహిళలకు ఎడమ కన్ను అదరడం వల్ల భవిష్యత్తులో త్వరగా డబ్బు సంపాదంచబోతారని అన్ని రకాలుగా మీకు బాగా కలిసి వస్తుందని అర్థం.

ఈ కన్ను అదిరితే మీకు త్వరలోనే ధన లాభం కలగబోతుందని అర్థం అవుతుంది. అంతే కాకుండా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కన్ను అదరడం వల్ల ఇంటికి అతిథులు వస్తారని ఇంట్లో పెద్దలు అంటూ ఉంటారు. ఎడమ కన్ను అదురు ఇంటికి చుట్టాల రాకను చెప్తుందని అంటారు. కాబట్టి ఎడమ కన్ను అదిరితే చెడు జరుగుతుంది కేవలం అపోహ మాత్రమే..