Site icon HashtagU Telugu

Coconut: కొబ్బరికాయలో పువ్వు కనిపించిందా.. అది దేనికి సంకేతమో తెలుసా?

Coconut

Coconut

హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలు పెట్టిన కూడా కొబ్బరికాయ కొట్టడం అన్నది తప్పనిసరి. ప్రతి ఒక శుభకార్యాన్ని కొబ్బరికాయ కొట్టి మొదలు పెడుతూ ఉంటారు. అయితే అలా కొబ్బరికాయ కొట్టినప్పుడు కొన్ని కొన్ని సార్లు కుళ్ళిపోవడం మరికొన్నిసార్లు ఆ కొబ్బరికాయలో పువ్వు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమంది కొబ్బరికాయ కుళ్ళిపోయినప్పుడు ఏదైనా అశుభం జరుగుతుంది ఏమో కీడు జరుగుతుంది ఏమో అని భయపడుతూ ఉంటారు. మరికొందరు కొబ్బరికాయలో పువ్వు వచ్చినప్పుడు సంతోషించడంతో పాటు ఏదో శుభకార్యం జరగబోతోంది మంచి జరగబోతోంది అని సంతోషపడుతూ ఉంటారు.

అయితే నిజానికి పూజలో కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే దోషమేమికాదని అంటున్నారు జ్యోతిష నిపుణులు. దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ క్రుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్ళతో శుభ్రం చేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామిని అలంకరిస్తారు. అంటే ఆ దోషం క్రుళ్ళిన కొబ్బరికాయదే కాని ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులోని పరమార్థం. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ క్రుళ్ళితే క్రుళ్ళిన భాగాన్ని తీసేసి కాళ్ళూ, చేతులూ, ముఖమూ కడుగుకొని పూజామందిరాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ పూజ ఆరంభించటం మంచాలి. వాహనాలకి కొట్టే కాయ క్రుళ్ళితే దిష్టి అంతా పోయినట్టే.

అయినా సరే మళ్ళీ వాహనం కడిగి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలి. అలాగే కొబ్బరికాయ కొట్టినప్పుడు కొన్ని కొబ్బరికాయల్లో పువ్వు కనిపిస్తుంది. ఇలా పువ్వు కనబడినా కొందరు ఆందోళన పడతారు. కానీ కొబ్బరికాయలో పువ్వు కనబడితే సంతానభాగ్యం అనే విశ్వాసం వుంది. కొబ్బరికాయలో పువ్వు రావడాన్ని మంచి సంకేతం గానే భావించాలి.ఇలా పువ్వు రావడం వల్ల మంచి జరుగుతుందని పాజిటివ్ ఎనర్జీ కి సంకేతమని చెబుతున్నారు. కాబట్టి ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే అది శుభానికి చిహ్నంగా భావించండి. అంతే కానీ దాని వల్ల చెడు జరుగుతుంది అనుకుంటే పొరపాటు.