Rudraksha: రుద్రాక్ష ధరిస్తే కష్టాలు పోయి, లక్ష్మీదేవి కరుణిస్తుందా.. పండితులు ఏం చెబుతున్నారంటే?

భారతదేశంలో హిందువులు రుద్రాక్షలు ధరిస్తూ ఉంటాడు. రుద్రాక్షని పరమేశ్వరుని స్వరూపంగా భావించి ధరిస్తూ ఉంటారు.. రుద్రాక్షలు ధరించడం వల్ల మంచిదన

  • Written By:
  • Publish Date - July 21, 2023 / 10:00 PM IST

భారతదేశంలో హిందువులు రుద్రాక్షలు ధరిస్తూ ఉంటాడు. రుద్రాక్షని పరమేశ్వరుని స్వరూపంగా భావించి ధరిస్తూ ఉంటారు.. రుద్రాక్షలు ధరించడం వల్ల మంచిదని నమ్ముతూ ఉంటారు. రుద్రాక్షను ధరించడం మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. కొంతమంది చేతికి రుద్రాక్షను ధరిస్తూ ఉంటారు. అలా చేతికి రుద్రాక్షను ధరించవచ్చా? దానివల్ల ఏమైనా నష్టాలు కలుగుతాయా లాభాలు కలుగుతాయా అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రుద్రాక్ష ధరించడం వల్ల సౌభాగ్యం, సాఫల్యం, సమృద్ధి మూడు కూడా లభిస్తాయి. కానీ రుద్రాక్షను ఎప్పుడు మంత్రోచ్ఛారణ తరువాతే ధరించాలి. రుద్రాక్ష అనేది భయం నుంచి విముక్తి కల్పించడమే కాకుండా అదృష్టానికి కారణం అవుతుంది. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ఎనర్జీ, సామర్ధ్యం కూడా పెరుగుతుంది.

ఇక కొంతమంది రుద్రాక్షను మెడలో కూడా ధరిస్తారు. ఇంకొంతమంది, మరికొంతమంది బ్రాస్ లెట్ లా దరిస్తారు. అలాగే శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు. శివుడి కటాక్షం పొందేందుకు, కోరికలు నెరవేర్చుకునేందుకు రుద్రాక్షను ధరిస్తారు. ఒకవేళ రుద్రాక్షను ధరించే విషయంలో ఏవైనా సందేహాలు అపోహలు ఉంటే వెంటనే వాస్తు శాస్త్ర నిపుణులను, పండితులను ఆ సంప్రదించడం మంచిది. అలాగే ఈ రుద్రాక్షను ధరించేటప్పుడు ఎలా పడితే అలా కాకుండా కొన్ని రకాల పరిహారాలు పాటించడం తప్పనిసరి.