మామూలుగా కొందరు స్త్రీలకు గాజులు అంటే పిచ్చి ప్రాణం అని చెప్పవచ్చు. ఆడవారికి గాజులు అలంకారం. అందుకే చిన్న వయసు నుంచి ఆడపిల్లలకు గాజులు వేసుకోవడం అలవాటు చేస్తూ ఉంటారు. నిజానికి గాజులకు హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ గాజులు భార్యాభర్తల బంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయని నమ్ముతారు. అయితే పెళ్లిలో ప్రతి ఒక్కరూ ఆకు పచ్చ గాజులనే వేసుకుంటుంటారు. చాలా వరకు స్త్రీలు ఆకుపచ్చ లేదంటే ఎరుపు గాజులు వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు.
ముఖ్యంగా ఆకుపచ్చ గాజులు వేసుకోవడం వల్ల కొన్ని రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెళ్లైన ఆడవారు ఖచ్చితంగా గాజులను వేసుకోవాలనే నియమం ఉంది. ముఖ్యంగా పెళ్లికి చాలా మంది ఆకుపచ్చ, ఎర్ర గాజులనే వేసుకుంటుంటారు. ఈ ఆకుపచ్చ గాజులు వేసుకోవడాన్ని శుభప్రదంగా భావిస్తారు. అందుకే శుభకార్యానికి పచ్చని గాజులను వేసుకోవాలని చెబుతుంటారు. కాగా ఆడవాళ్లు రెండు చేతులకు ఆకుపచ్చని గాజులను వేసుకోవడం వల్ల వారికి ఉన్న అన్ని రకాల బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇది భార్యాభర్తల మధ్య బంధాన్ని కూడా బలోపేతం చేయడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే ఆకుపచ్చ గాజులను వేసుకోవడం వల్ల ఆడవారి శరీరంలో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు.
ఆకుపచ్చని గాజులు జీవితంలో నెగిటివిటీని తొలగించి లైఫ్ ను ఆనందంగా, సంతోషంగా చేస్తుందని చెబుతున్నారు. అలాగే ఆకుపచ్చ రంగు బుధ గ్రహానికి సంబంధించినది. దీని బలం జీవితంలో సౌభాగ్యాన్ని తెస్తుంది. అలాగే ఆకుపచ్చ గాజులను వేసుకోవడం వల్ల ఆడవాళ్లు ప్రతి పనిలో విజయం సాధిస్తారని పండితులు చెబుతున్నారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలంటే చేతులకు ఆకుపచ్చని గాజులను ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ ఆకుపచ్చని గాజులు ఆడవాళ్లకు అదృష్టాన్ని తెస్తుందని కూడా నమ్మకం ఉంది. పెళ్లయిన ఆడవారు రెండు చేతులకు ఆకుపచ్చని గాజులను వేసుకోవడం వల్ల శివ పార్వతుల అనుగ్రహం లభిస్తుందట. ఈ గాజులు శుభం, శ్రేయస్సుకు చిహ్నంగా కూడా పరిగణిస్తారు.
పెళ్లి తర్వాత ఆకుపచ్చని గాజులను వేసుకోవడాన్ని శుభప్రదంగా భావిస్తారు. వివాహిత స్త్రీలకు అకుంఠిత శుభం ఆశీర్వాదం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.