‎Dream: మీకు పెళ్లి జరిగినట్టు కల వచ్చిందా.. అయితే దాని అర్ధం ఇదే!

‎Dream: నిద్రపోతున్నప్పుడు మీకు కలలో పెళ్లి జరిగినట్టు కల వస్తే దాని అర్థం కొన్ని జరగబోతున్నాయి అనడానికి సంకేతాలుగా భావించాలని చెబుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Dreama

Dreama

Dream: మాములుగా మనం పడుకున్నప్పుడు అనేక రకాల కలలు వస్తూ ఉంటాయి. కొందరికి పగటి సమయంలో వస్తే,కొందరికి రాత్రిళ్లు కలలు వస్తూ ఉంటాయి. అయితే వీటిలో రాత్రిళ్లు, ముఖ్యంగా తెల్లవారు జామున వచ్చే కలలు ఎక్కువగా నిజం అవుతాయని అంటుంటారు. అయితే కొందరికి మంచి జరిగినట్లు కలలు వస్తే, మరి కొందరికి చెడు కలలు రావచ్చు. అయితే కలలు అనేవి మన అంతర్ దృష్టికి సంబంధించినవని జోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వివాహం వంటి ముఖ్యమైన సంఘటనలు మీ కలలోకి వస్తే, అది భవిష్యత్తులో జరిగే మార్పులను సూచిస్తుందట.

‎ఇది మంచి సంకేతం అయినా కావచ్చని, లేదంటే మనకు అదొక హెచ్చరిక కావచ్చని చెబుతున్నారు. మరి వివాహానికి సంబంధించిన కలలు వస్తే దాని అర్థం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీరు చాలా సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నట్లు కలలు వస్తున్నట్లయితే మీ జీవితంలో మంచి మార్పులు వస్తున్నాయని అర్థం. స్పష్టమైన, ప్రశాంతమైన వివాహ కలలు విజయం అని ఇది పురోగతిని సూచిస్తాయని అంటున్నారు. మీరు వివాహం వంటి ఆచారాల గురించి కలలు కంటున్నట్లయితే, అది మీ జీవితంలో మంచి సంఘటనలు జరిగే అవకాశం ఉందని జోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

‎మీ పెళ్లి సంతోషంగా, ఉత్సాహంగా కాకుండా లేకుండా ఏవైనా గొడవలు, తగాదాలు ఏదైనా గందరగోళం లాంటివి జరిగితే మీ వైవాహిక జీవితం సమస్యల్లో చిక్కుకోవచ్చని అర్థం అంటున్నారు. అదేవిధంగా, మీకు వివాహం ఆగిపోయినట్లు కలలు వస్తే మీ జీవితంలో మీరు అనుకున్న అన్ని పనులు సవ్యంగా జరగవని, ఆటంకాలు వచ్చి ఆగిపోయే అవకాశం ఉందని అర్థం అంటున్నారు. మీరు నల్లటి దుస్తులలో పెళ్లి చేసుకున్నట్లు కల వస్తే మీ కుటుంబంలో ఏదో దుఖం లేదా, నష్టం జరిగే అవకాశం ఉందని అర్థం అంటున్నారు స్వప్న శాస్త్ర నిపుణులు. శుక్రుడు ప్రేమ , వివాహాన్ని నియంత్రిస్తాడు. కలలో వివాహం శుక్రుడిచే ప్రభావితమవుతుంది. మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే, ఆ కల అదృష్టాన్ని తెస్తుందట. శుక్రుడు బలహీనంగా ఉంటే, మీరు మీ సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
‎మీకు మంచి కల వస్తే, సానుకూల ఆలోచనలను పెంపొందించుకోవాలట. మీకు చెడు కల వస్తే, మీరు జ్యోతిష్కుడిని సంప్రదించి ఏదైనా పూజ చేయవచ్చని చెబుతున్నారు.

  Last Updated: 28 Nov 2025, 08:57 PM IST