Site icon HashtagU Telugu

Dreams: చనిపోయిన వ్యక్తులు కలలో కనిపిస్తే దాని అర్థం ఏంటో మీకు తెలుసా?

Dreams

Dreams

మామూలుగా మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని మంచి కలలు అయితే మరికొన్ని చెడ్డ కలలు మరికొన్ని పీడకలలు కూడా వస్తూ ఉంటాయి. మనం ఎక్కువగా ఏ విషయాల గురించి అయితే ఆలోచిస్తూ ఉంటామో ఆ విషయానికి సంబంధించి వచ్చే కలలు చాలా వరకు జరగవు అని పండితులు చెబుతున్నారు. ఇక చాలామందికి కలలో చనిపోయిన వారు కనిపిస్తూ ఉంటారు. వారి గురించి కొన్నిసార్లు ఆలోచించకపోయినప్పటికీ కూడా వారు కలలోకి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి అలా వస్తే అది దేనికి సంకేతమో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చనిపోయిన వ్యక్తులు మీ కలలో మిఠాయిలు పంచుతున్నట్లు లేదా మీకు ఏదైనా ఇచ్చినట్లు కనిపిస్తే, అది శుభప్రదం అని అంటారు. మీరు మీ చనిపోయిన వ్యక్తులకు ఇచ్చిన శ్రాద్ధకర్మలతో వారు చాలా సంతోషంగా ఉన్నారని అర్థం. అలాగే మీరు త్వరలో మీ ఇంట్లో సంతోషకరమైన వార్తను వింటారని ఇది సూచిస్తుందట. చనిపోయిన వ్యక్తులు కలలో మాట్లాడుకుంటున్నట్లు కనిపించినా ఆ కలలను శుభప్రదంగా భావిస్తారు. అలా చూసినట్లయితే సమీప భవిష్యత్తులో మంచి విజయం అందుతుందని అర్ధం అంటున్నారు పండితులు. మీకు అలాంటి కల కనిపిస్తే, రాబోయే కాలం చాలా బాగుంటుందని అర్ధమట.

అదేవిధంగా చనిపోయిన వ్యక్తులు కలలో కనిపించి వెంటనే మాయమైతే అశుభానికి సంగీతంగా భావించాలట. అటువంటి కలను చూడటం అంటే మీరు పెద్ద ఇబ్బందుల్లో పడతారని అర్థం అంటున్నారు. అయితే అటువంటి పరిస్థితిలో మీరు మీ ఇష్టమైన దైవాన్ని పూజించాలట. అలాగే మీరు కలలో మీ చనిపోయిన వ్యక్తులు చాలా కోపంగా ఉన్నట్లు కనిపిస్తే, మీరు చేసిన పనికి చనిపోయిన వ్యక్తులు సంతోషంగా లేరని అర్థం. ఇంట్లో పృథ దోషం ఉందని కలల అర్థం అంటున్నారు.

Exit mobile version