Vasthu Tips: ఇంట్లోకి గుడ్లగూబ కాకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా మన ఇంటి ఆవరణలో ఇంటి పైకప్పు ప్రాంతంలో ఎన్నో రకాల పక్షులు వాలుతూ ఉంటాయి. అయితే

  • Written By:
  • Publish Date - January 16, 2023 / 06:00 AM IST

సాధారణంగా మన ఇంటి ఆవరణలో ఇంటి పైకప్పు ప్రాంతంలో ఎన్నో రకాల పక్షులు వాలుతూ ఉంటాయి. అయితే కొందరు పక్షులు ఇంటి దగ్గరకు రాగానే వాటిని తరిమేయగా మరి కొందరు మాత్రం పక్షులకు ప్రేమగా ఆహారం పెడుతూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మనం అనుకోకుండా ఇల్లు వాకిలి తెరిచి ఉన్నప్పుడు కొన్ని రకాల పక్షులు ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి. కేవలం పక్షులు మాత్రమే కాదు జంతువులు కూడా ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అయితే ఇలా పక్షులు జంతువులు ఇంట్లోకి ప్రవేశించడం మంచిది కాదు అని కొందరు అభిప్రాయపడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా కొందరు అయితే కాకీ,గుడ్లగూబ వంటి పక్షులు ఇంట్లోకి దూరడం అశుభమని, కీడు జరుగుతుంది అని భావిస్తూ ఉంటారు.

కానీ వాస్తు శాస్త్ర ప్రకారం ప్రక్షులు లేదా జంతువులు ఇంట్లోకి హఠాత్తుగా ప్రవేశించినట్లయితే అది దైవిక శక్తి పంపిన సంకేతంగా అర్థం చేసుకోవాలి. అయితే ఇలా పక్షులు జంతువులు ఇంట్లోకి ప్రవేశించడం వెనుక కొన్ని అర్థాలు ఉన్నాయి. మరి కాకి గుడ్లగూబ ఇంట్లోకీ ప్రవేశిస్తే ఏం జరుగుతుందో అది దేనికి సంకేతమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం అన్న విషయం తెలిసిందే. కొందరు గుడ్లగూబని చూసి భయపడితే మరి కొందరు మాత్రం అసహ్యించుకుంటూ ఉంటారు. వారికీ ఆహారం పెట్టడానికి కూడా కొందరు అశుభంగా భవిస్తారు భావిస్తారు. కేవలం దీపావళి రోజున మాత్రమే గుడ్లగూబ రాకను శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే ఆ రోజు లక్ష్మీదేవిని పూజించే రోజు.

ఇతర రోజుల్లో, గుడ్లగూబ రాక ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది. ఇంటికి గుడ్లగూబ వస్తే ఆ ఇంటి పురోగతి కుంటుపడుతుంది. ఇంట్లో నివసించే సభ్యుల మధ్య మనస్పర్థలు రావచ్చు. ఇంట్లోకి గుడ్లగూబ వస్తే దానికి పరిష్కారంగా ఎర్రటి గుడ్డ, తిలకం దానం చేయవచ్చు. అలాగే కాకి ఇంట్లోకి రావడం అంటే శని ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు అని అర్థం. ఎందుకంటే కాకి శని వాహనం అన్న విషయం తెలిసిందే. కానీ శని చెడు కాదు. అయితే ఇది దైవభక్తిని పెంపొందించడానికి భగవంతుని సూచన. కాకి ఇంటి ముందు కూర్చొని చెడు స్వరంతో అరవడం అశుభంగా పరిగనించాలి. కాకి పదేపదే ఇంట్లోకి ప్రవేశిస్తే, మీరు శాంతించాలి.