Crow: ఇంటిముందు కాకి అరిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. జరగబోయేది ఇదే?

కాకిని శని దేవుని వాహనంగా భావిస్తారు. ఈ కాకిని చూడగానే కాస్త భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ కాకి ఇంట్లోకి దూరడం మంచిది కాదని, కాకి తలపై తినడం మ

  • Written By:
  • Updated On - February 23, 2024 / 09:27 PM IST

కాకిని శని దేవుని వాహనంగా భావిస్తారు. ఈ కాకిని చూడగానే కాస్త భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ కాకి ఇంట్లోకి దూరడం మంచిది కాదని, కాకి తలపై తినడం మంచిది కాదని, ఏదైనా పనిమీద వెళుతున్నప్పుడు కాకి ఎదురు రావడం మంచిది కాదని చాలామంది ఎక్కువ శాతం కాగి గురించి నెగటివ్ గానే ఆలోచిస్తూ ఉంటారు. కానీ కొందరు కాకి శని వాహనం కావడంతో పూజలు చేయడంతో పాటు ఆహారం కూడా పెడుతూ ఉంటారు. ఇకపోతే ఇంటికి ఎదురుగా కాకి అరిస్తే బంధువులు వస్తారని చుట్టాలు వస్తారని చెబుతూ ఉంటారు. నిజానికి ఇంటి పైకప్పు పై ఇంటి ముందు కాకి అరవడం దేనికి సంకేతం అలా అరిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఒకవైపు చాలా కాకులు కూర్చోవడం చూస్తే మున్ముందు ప్రమాదం పొంచి ఉంటుందని, మీరు పెద్ద విపత్తును ఎదుర్కోబోతున్నారనే అర్థం వస్తుంది. ఇంటి పై కప్పుపై కాకులు అరుస్తుంటే ఆ కుటుంబానికి గడ్డుకాలం రాబోతోందని, కాకులు మరణవార్తను కూడా తెస్తాయని మన పూర్వీకులు చెబుతుంటారు. కాకులకు ప్రజల జీవితంలో జరిగే మంచి, చెడు సంఘటనలను అంచనా వేయగల సామర్థ్యం ఉందని అంటూ ఉంటారు. కాకి ఎగురుతూ ఉన్న సమయంలో ఒక వ్యక్తిపై రెట్ట వేస్తే అది చెడుకు సంకేతంగా భావించాలి. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఆర్థిక నష్టాలను ఎదుర్కోవల్సి ఉంటుందనే అర్థం వస్తుంది. కాకి ఎగురుతున్నప్పుడు ఒక వ్యక్తి శరీర భాగాన్ని తాకడం చాలా శుభ సంకేతంగా పరిగణిస్తారు. త్వరలో మీకు డబ్బు రాబోతోందని అర్థం.

అయితే కాకి ఎగురుతూ తలకు తగిలితే జాగ్రత్తగా ఉండాలని, శరీరం తీవ్రంగా క్షీణిస్తుందని, ఆర్థిక కష్టాలెదురవుతాయని అర్థం. దీనివల్ల మనిషి ఆయుష్షు తగ్గిపోతుంది. ఎక్కడికైనా వెళుతున్నప్పుడు కాకి కుండలోని నీళ్లు తాగడం చూస్తే త్వరలో డబ్బే వస్తుంది. అలాగే కాకి తన ముక్కులో ఆహారంతో ఎగురుతున్నట్లు చూడటం కూడా శుభసూచకంగా పరిగణిస్తారు. మధ్యాహ్న సమయంలో ఉత్తరం లేదా తూర్పున కాకులు అరుపులు వినడం శుభప్రదం. కాకి ఇంటి దగ్గరికి వచ్చి ఆరిస్తే ఆ రోజు మీ ఇంటికి చుట్టాలు వచ్చే అవకాశం ఉందని అర్థం. తెల్లవారుజామునే ఇంటి పై కప్పుపై ఉన్న కాకులకు ఆహారం వేసి వారి దోషాలు పోగొట్టుకుంటారు కొంతమంది.