Tulsi Plant: పొరపాటున కూడా తులసి మొక్క దగ్గర వీటిని అస్సలు పెట్టకండి?

హిందూ ధర్మంలో తులసి మొక్కను పరమపవిత్రంగా భావించడంతో పాటు పవిత్రంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఇంటి ఆస్తిగా కూడా పరిగ

  • Written By:
  • Publish Date - June 16, 2024 / 02:07 PM IST

హిందూ ధర్మంలో తులసి మొక్కను పరమపవిత్రంగా భావించడంతో పాటు పవిత్రంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఇంటి ఆస్తిగా కూడా పరిగణిస్తారు. అంతే కాకుండా క్రమం తప్పకుండా తులసి మొక్కకు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి విష్ణువు ఇద్దరూ కొలువై ఉంటారని విశ్వసిస్తూ ఉంటారు. కాబట్టి తులసి మొక్కను భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల తులసి దేవి అనుగ్రహంతో పాటు లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది.

తులసి మొక్కకు పూజ చేయడం మంచిదే కానీ, పూజ చేసేటప్పుడు తెలిసి తెలియకుండా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు. కొన్ని రకాల నియమాలను తప్పకుండా పాటించాలి. వాటిని పాటించకపోవడం వల్ల జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే తులసికి పూజ చేసేటప్పుడు కొన్ని విషయాలను మరచిపోకూడదు. దీని వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ నివసిస్తుంది. తులసి మొక్క దగ్గర శివలింగాన్ని ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు.

అలాగే తులసి మొక్క దగ్గర చెప్పులను, బూట్లను పొరపాటున కూడా పెట్టకూడదు. ఇలా చేస్తే సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దాంతో మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంటి దక్షిణ దిక్కును పూర్వీకులు, యమరాజుదిగా భావిస్తారు. అందుకే ఈ దిశలో తులసి మొక్కని నాటకూడదు. తులసి మొక్కను ఉంచడానికి ఈశాన్య దిశ ఉత్తమమైనదిగా భావిస్తారు.