December Horoscope : 2024 సంవత్సరంలోని చిట్టచివరి నెల డిసెంబరులోకి మనం అడుగుపెట్టబోతున్నాం. ఈ నెలలో మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. వచ్చే నెలలో శుక్ర, రవి గ్రహాలు మాత్రమే రాశులు మారుతాయి. మిగిలిన గ్రహాలు వాటి మునుపటి స్థితిలోనే కంటిన్యూ అవుతాయి. శుక్ర, రవి గ్రహాలు రాశులు మారడం వల్ల కొందరు ఉద్యోగ, వ్యాపార పరమైన మార్పులను చూడాల్సి వస్తుంది.
Also Read :Hyderabad to Vijayawada : హైస్పీడ్ ట్రైన్స్.. గంటలోనే హైదరాబాద్ టు విజయవాడ.. విమానం కంటే చౌక!
మేష రాశి
డిసెంబరు నెలలో మేషరాశి వారు ఆర్థికంగా బలపడతారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. మరింత మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే సూచనలున్నాయి. విదేశాల నుంచి పెళ్లి సంబంధాలు వచ్చే ఛాన్స్ ఉంది.
వృషభ రాశి
డిసెంబరు నెల వృషభ రాశి వారికి లాభదాయకం. ప్రభుత్వమూలక ధన లాభం ఉంటుంది. ఆస్తుల కొనుగోలుకు మంచి టైం. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. కొందరికి పిత్రార్జితం లభిస్తుంది. విదేశీ ప్రయాణానికి ఆటంకాలు తొలగిపోతాయి.
సింహ రాశి
డిసెంబరు నెలలో సింహ రాశి వారికి ఉద్యోగపరంగా ఊహించని అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగులకు ఇతర కంపెనీల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందొచ్చు. నిరుద్యోగులకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. అయితే ప్రయాణాల్లో ప్రమాద సూచన ఉంది. పెళ్లి సంబంధాలు కుదురుతాయి.
తులా రాశి
డిసెంబరు నెలలో తులా రాశివారికి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవి లభిస్తుంది. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి.కష్టానికి తగిన ఫలితం పొందుతారు. సొంత ఇంటి కల నెరవేరుతుంది. సామాజికంగా హోదా పెరుగుతుంది.
ధనుస్సు రాశి
డిసెంబరు నెలలో ధనుస్సు రాశిలోని ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు వస్తాయి. విదేశీ సొమ్ము అనుభవించే యోగం దరి చేరుతుంది. తండ్రి వైపు నుంచి సంపద వస్తుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో సక్సెస్ అవుతారు. స్థిరాస్తులు కొంటారు.
మకర రాశి
డిసెంబరు నెలలో మకర రాశిలోని(December Horoscope) కొందరు ఉద్యోగులు పదోన్నతి పొందుతారు. అనేక శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. ఇతరులతో కఠినంగా మాట్లాడితే కష్టాలు తప్పవు. అనుకోని ఖర్చులు వస్తాయి.
Also Read :Viral : పబ్లిక్ లో బ్రా వేసుకొని రీల్స్.. జనం చూస్తూ ఊరుకుంటారా..!!
మిథున రాశి
డిసెంబరు నెలలో మిథున రాశిలోని ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి. ఈనెలలో 15వ తేదీ తర్వాత వీరికి అనుకూలమైన టైం మొదలవుతుంది. అప్పటివరకు గొడవలకు దూరంగా ఉండాలి. ఆదాయానికి మించి ఖర్చులు చేయొద్దు. కొత్త పరిచయాలతో పురోగతి సాధిస్తారు.
కర్కాటక రాశి
డిసెంబరు నెలలో కర్కాటక రాశిలోని పలువురు ఉద్యోగులకు ప్రమోషన్స్ వస్తాయి. వ్యాపారంలో డెవలప్ అవుతారు. ఆర్థికంగా కొంత సెట్ అవుతారు. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది పడతారు. వ్యాపారంలో ముందుకు సాగుతారు.
కన్యా రాశి
డిసెంబరు నెలలో కన్యా రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. సీనియర్ ఉద్యోగుల సహకారంతో మరింత మంది ఉద్యోగ అవకాశాల గురించి తెలుసుకుంటారు. మీ శత్రువులపై గెలుపొందుతారు. అయితే మీరు నోటి దురుసును ప్రదర్శించకూడదు. తద్వారా చేటు జరిగేే ముప్పు ఉంది.
వృశ్చిక రాశి
డిసెంబరు నెలలో వృశ్చిక రాశి వారికి మొండిబాకీలు వసూలు అవుతాయి. కొత్త ఇళ్లను కొంటారు. పాత ఇళ్లను మారుతారు. కొత్త వాహనాలు కొంటారు. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు.
కుంభ రాశి
డిసెంబరు నెలలో కుంభరాశి వారు ఆర్థికంగా అలర్ట్ మోడ్‌లో ఉండాలి. లేదంటే ఇబ్బంది తప్పదు. చాలా ప్లానింగ్‌తో డబ్బులు ఖర్చు పెట్టాలి. ఏదైనా ఎమర్జెన్సీ అవసరం వచ్చే అవకాశం ఉంది. ఆందోళన చెందకుండా ధైర్యంగా ముందుకుసాగండి. మీకు కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది.
మీన రాశి
డిసెంబరు నెలలో మీన రాశిలోని కొందరు ఉద్యోగులకు బదిలీలు జరుగుతాయి. అయితే ఆ బదిలీలు లాభదాయకంగా ఉండొచ్చు. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. అయితే ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఒకేసారి భారీ పెట్టుబడులు పెట్టొద్దు.
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.