ఈ రోజుల్లో చాలామంది ఎదురుకుంటున్న సమస్యల్లో డబ్బు సమస్య అప్పుల సమస్యలు ప్రధానంగా మారిపోయాయి. ఎంత కష్టపడి సంపాదించినా కూడా చేతిలో చెల్లి గవ్వ మిగలడం లేదని అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని బాధపడుతూ దిగులు చెందుతూ ఉంటారు. పైగా సంపాదించిన డబ్బులు చేతిలో మెదలకపోగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాము అని బాధపడుతూ ఉంటారు. అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు పాటిస్తే ఎలాంటి ఆర్థిక సమస్యలు అయినా సరే తప్పకుండా తీరతాయని చెబుతున్నారు. మరి అందుకోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మంగళవారం రోజున ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎందుకు తీసుకురావాలి. ఆగ్రహాన్ని ఎలాంటి లోహంతో తయారు చేసినా పర్వాలేదు అంటున్నారు. అలా తీసుకువచ్చిన విగ్రహాన్ని పూజ గదిలో ఉంచి సింధూరం జలాలతో అభిషేకం చేయాలట. సింధూరం నీటిలో కలిపి స్వామి వారికి అభిషేకం చేయాలని చెబుతున్నారు. అలా అభిషేకం చేసే సమయంలో “ఓం పవనసుతాయ నమః “అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలట. సింధూర జలాలతో అభిషేకం పూర్తి అయిన తర్వాత పంచామృతాలతో అభిషేకం చేయాలని చెబుతున్నారు. పంచామృతాలతో అభిషేకం చేసేటప్పుడు కూడా “ఓం పవనసుతాయ నమః “అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలని చెబుతున్నారు. పంచామృతం చేసిన తర్వాత ఆ పంచామృతాలను నైవేద్యంగా స్వీకరించాలని సింధూర జలాలను నుదుటిన ధరించాలని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా కనీసం 9 మంగళ వారాలు చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని, అదృష్టం కలిసి వచ్చి ధనం వస్తుందని అప్పుల బాధలు అన్నీ తీరిపోతాయని చెబుతున్నారు.
అలాగే సుబ్రహ్మణ్యస్వామి పూజించడం వల్ల కూడా అప్పుల సమస్యలు తీరిపోతాయట. ఇందుకోసం మంగళవారం రోజు ఒక ఎర్రటి వస్త్రంలో ఐదు గులాబీ పువ్వులు కొంచెం పట్టిక బెల్లం కొన్ని బియ్యం వేసి మూట కట్టాలి. సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లి ఆ మూటను చేతిలో పట్టుకొని అప్పులు పోవాలని, ఆర్థిక సమస్యలు ఉండకూడదని ప్రార్థిస్తూ తొమ్మిది సార్లు ఆలయంలో ప్రదక్షిణలు చేయాలి. వీలైతే అర్చన చేయించుకుని గుడి ప్రాంగణంలో కొద్దిసేపు కూర్చోవాలి. ఆ తర్వాత ఆ మూటను దగ్గరలో పారే నీటిలో విడిచిపెట్టాలి. అలా వీలుగానీ పక్షంలో ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్టు మొదట్లో ఉంచాలని చెబుతున్నారు. మంగళవారం సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఈ ప్రత్యేక పరిహారం చేసుకుంటే ఆ స్వామి అనుగ్రహం కలిగి క్రమంగా అప్పుల బాధల నుంచి బయటపడవచ్చట.
ఒక ఉంగరం తో కూడా అప్పులు బాధల నుంచి బయటపడవచ్చట. ఇంతకీ ఆ ఉంగరం ఏంటి అంటే పగడ గణపతి ఉంగరం. నవరత్నాల్లో పగడాన్ని తీసుకుని దానిమీద గణపతి రూపాన్ని చెక్కించాలి. ఆ తర్వాత ఆ పగడ గణపతిని రాగి లోహంతో చేయించుకుని కుడి చేయి ఉంగరం వేలుకు ధరిస్తే అప్పుల బాధ నుంచి ఈజీగా బయటపడవచ్చట..
అలాగే ఒక చిన్న బంగారు శివలింగాన్ని ఇంటికి తీసుకువచ్చి పూజ గదిలో ఉంచాలట. గురువారం రోజు ఆ బంగారు శివలింగానికి ఆవు పాలు లేదా నీటితో అభిషేకం చేయాలని చెబుతున్నారు. 16 గురువారాలపాటు పరిహారం పాటించాలట. అభిషేకం చేసే సమయంలో” శ్రీమ్ శివాయనమః ” అనే మంత్రాన్ని 21 సార్లు చదువుతూ శివలింగానికి అభిషేకం చేయాలని చెబుతున్నారు. 16 గురువారాలు పూర్తి అయిన తర్వాత ఏదైనా దేవాలయంలో దక్షిణతో పాటు ఆ బంగారు శివలింగాన్ని కూడా దానం ఇవ్వాలని ఇలా చేస్తే ధనం సమకూరి ఎంత పెద్దలో అప్పులు ఉన్నా సరే అవి మొత్తం తీరిపోతాయని చెబుతున్నారు.