Site icon HashtagU Telugu

Sri Rama Navami 2025: కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉండాలంటే శ్రీరామనవమి రోజు ఈ పరిహారాలు పాటించాల్సిందే!

Sri Rama Navami 202

Sri Rama Navami 202

హిందువులు ప్రతి ఏడాది ఉగాది పండుగ తరువాత శ్రీరామనవమి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం నవమి రోజున ఈ శ్రీరామనవమి పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఏడాది ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం రోజు రాములవారి పండుగను జరుపుకోనున్నారు. ఈరోజుని శ్రీరాముని పుట్టినరోజు గా కూడా పిలుస్తారు. ఇంతటి శుభప్రదమైన రోజున కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల జీవితంలో ఉండే కష్టాలు అన్ని తొలగిపోతాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కెందుకు శ్రీరామనవమి రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించాలట. అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో 11 గోమతి చక్రాలు, 11 కరివేపాకులు, 11 లవంగాలు, పంచదారతో చేసిన 11 బతషాలు ఉంచి లక్ష్మీదేవికి, రాముడికి సమర్పించాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయట. అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ కోసం ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో 108 సార్లు శ్రీరామరక్ష మంత్రాన్ని జపించి ఆ నీటిని ఇల్లు మొత్తం చల్లుకోవాలని ఇలా చేస్తే ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందని చెబుతున్నారు.

అలాగే ప్రస్తుత రోజుల్లో వివిధ కారణాల వల్ల చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆరోగ్యంగా ఉండేందుకు ఆంజనేయుడి అనుగ్రహం తప్పనిసరి అంటున్నారు పండితులు. హనుమంతుడి అనుగ్రహం ఉంటే ఎటువంటి వ్యాధులు, భయాలైన తొలగిపోతాయట. అందుకోసం శ్రీరామనవమి రోజు సాయంత్రం ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలట. అలాగే హనుమాన్ చాలీసా పఠించాలట. అలాగే సంతోషంగా ఉండేందుకు నవమి రోజున రామాలయంలో నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించాలని చెబుతున్నారు. జై శ్రీరామ్ అనే నామాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందట..