మామూలుగా జీవితంలో ప్రతి ఒక్కరిని కష్టాలు ఏదో ఒక సమయంలో వెంటాడుతాయి. మనిషి జీవితంలో హెచ్చుతగ్గులు రావడం అన్నది సహజం. అది అదృష్టం దురదృష్టం అనేది కూడా వస్తూ ఉంటాయి. ఏదైనా కలిసి రావాలి అంటే అదృష్టం ఉండాలని చెబుతుంటారు. మొదలుపెట్టిన ప్రతి పని అన్నిట్లోనూ ఆటంకాలు ఏర్పడితే దురదృష్టం అని అంటూ ఉంటారు. అలాగే తరచుగా ఇంట్లో గొడవలు జరగడం వల్ల మనశ్శాంతి లేకుండా పోతూ ఉంటుంది. దీంతో చాలామంది మగవారు మద్యానికి కూడా బానిసలు అవుతూ ఉంటారు. అలాగే భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా అంత గట్టిగా ఉండవు. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
మాములుగా అందరి ఇళ్లలోనూ నిత్యం దీపారాధన చేస్తుంటారు. అయితే ఫ్యామిలీ మొత్తానికి అదృష్టం కలిసి రావాలంటే ఇంటి ఇల్లాలు జిల్లేడు వత్తులతో చేస్తే మంచిదట. అది కూడా నువ్వుల నూనె లేదా అవిసె నూనెతో జిల్లేడు వత్తులు ఉపయోగించి దీపారాధన చేయాలని చెబుతున్నారు.
గోధుమ పిండితో చపాతీలను చేసి తింటూ ఉంటాం.. కొందరు మార్కెట్లో దొరికే గోధుమపిండిని ఉపయోగిస్తే మరి కొందరు గోధుమలు తెచ్చుకొని వాటిని పెళ్లి చేసుకునే తింటూ ఉంటారు. ఇలా గోధుమలను ఆ పిండి చేసే సమయంలో ఒక నాలుగు శనగ గింజలను వేసి ఆడించి ఆ పిండితో రొట్టెలు చేసుకునే తింటే రవి గురువుల బలం వల్ల అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు.
చాలా కుటుంబాల్లో నిత్యం గొడవలు జరుగుతుంటాయి. ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుంటుంటారు. కొన్ని కొన్ని సార్లు భార్యాభర్తల మధ్య తగాదాలు ఏర్పడే విడిపోయే వరకు కూడా వెళ్తూ ఉంటారు. కుటుంబ కలహాలు ఉంటే లక్ష్మీ దేవి దూరమవుతుందని, దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుందని అంటున్నారు. కాబట్టి కుటుంబ కలహాలు రాకుండా లక్ష్మీ దేవి అనుగ్రహం కలగాలంటే వీలైనప్పుడు కుటుంబ సభ్యులందరూ ఒక సారి బావినీళ్లతో స్నానం చేయాలని చెబుతున్నారు. స్నానం చేసిన తర్వాత గోమాతకు 5 రకాల పప్పు ధాన్యాలు ఆహారంగా తినిపించాలట. ఇలా చేస్తే కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు క్రమక్రమంగా తగ్గి అదృష్టం కలిసి వస్తుందట. కుటుంబ సభ్యులందరికీ అదృష్టం, ఐశ్వర్యం కలిసి రావాలన్నా, అందరూ క్షేమంగా ఉండాలన్నా భోజనం చేసే సమయంలో పక్షులకు, జంతువులకు ఆహారం పెట్టాలట.