Site icon HashtagU Telugu

Eating Food: భోజనం చేసేటప్పుడు ఈ నియమాలు పాటించకపోతే మీకే నష్టం?

Mixcollage 13 Jul 2024 11 59 Am 2926

Mixcollage 13 Jul 2024 11 59 Am 2926

మాములుగా చాలామంది భోజనం చేసేటప్పుడు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. అలా మనం చేసే ఆ చిన్న చిన్న తప్పులే ఆర్థిక ఇబ్బందులకు అలాగే ఇతర సమస్యలకు కారణం కావచ్చు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని, అందుకే అన్నం పారేయకూడదు అలాగే అన్నం తినేటప్పుడు కొన్ని రకాల తప్పులు చేయకూడదని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. మరి భోజనం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పద్ధతులు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. భోజనం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా కింద కూర్చొని భోజనం చేయడం అన్నది చాలా మంచి పద్ధతి. ఈ విధంగా కిందన కూర్చుని తినడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుందట.

భోజనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా చెప్పులను ధరించరాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో బయట ఎక్కడైనా ఉన్నప్పుడు చెప్పులు వేసుకుని తింటే ఏమి కాదు కానీ, అదేపనిగా చెప్పులు వేసుకుని మాత్రం తినకూడదు. మన పూర్వకాలంలో బంతి భోజనాలు పెట్టేటప్పుడు చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కొని చెప్పులు పక్కన విప్పేసి మరీ చాప మీద కూర్చొని ఎంచక్కా భోజనం చేసేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో పరిస్థితిలు పూర్తిగా మారిపోయాయి. బఫ్ఫే సిస్టమ్‌లో చెప్పులు వేసుకొని నడుస్తూ, నిలబడుతూ తింటూ వున్నారు. అన్నం తినేటప్పుడు అన్నపూర్ణేశ్వరికి గౌరవం ఇవ్వాలి. కొందరు కాళ్ళ మీద కాలు వేసుకుని మరి భోజనం చేస్తూ ఉంటారు.

ఇలా తినడం అసలు మంచిది కాదు. ఒకవేళ మీరు హోటల్ కి వెళ్ళినా సరే,అక్కడ టేబుల్ మీద కూర్చుని తినేటప్పుడు చెప్పులు లేదా షూస్ వదిలేసి తినడం మంచిది. అలాగే ఎప్పుడు భోజనం చేయడానికి కూర్చున్నా అన్నపూర్ణేశ్వరీ దేవికి నమస్కారం చేసి కూర్చోవాలి. అదేవిధంగా భోజనం చేసేటప్పుడు దక్షిణంవైపు తిరిగి భోజనం చేయకూడదు. ఏ పరిస్థితిలో కూడా ఈ వైపున తిరిగి భోజనం చేయకూడదు. భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దను చేతిలో తీసుకొని కళ్లకు అద్దుకొని పక్కకు పెట్టి ఆ తరువాత భోజనం చేయాలి. పక్కకు పెట్టిన ఈ ముద్దను గోడమీద కాకులకు, లేదంట ఇంటి ముందు వున్న కుక్కలకు పెట్టడం వల్ల మంచి జరుగుతుంది అంటున్నారు పండితులు. అలాగే భోజనం చేసిన తరువాత అదే కంచంలో చేయి కడగకూడదు.

బయట ఎక్కడైనా సింక్ దగ్గర చేయి కడగాలి. భోజనం తిన్న తరువాత ప్లేటును వెంటనే కడిగివేయాలి. అలాగే పెట్టడం వల్ల ఉదయం వరకు బొద్దింకలు, ఈగలు వాలి దరిద్ర దేవతను ఇంట్లోకి ఆహ్వానించినట్టు అవుతుంది. అందుకే ఎప్పుడూ తిన్న కంచాన్ని అప్పుడే కడిగేయడం మంచిది. అలాగే భోజనం చేసిన తర్వాత చక్కగా చేయిని తుడుచుకోవాలి. భోజనం చేసిన తర్వాత చాలామంది చేతులు కడిగి చేతులను వదిలిస్తూ ఉంటారు. అలా చేయడం అస్సలు మంచిది కాదు అంటున్నారు పండితులు. అలా చేయడం దరిద్రమని పండితులు చెబుతున్నారు.