Site icon HashtagU Telugu

Periods: పీరియడ్స్ రెగ్యులర్ గా రావడం లేదా.. అయితే జాగ్రత్త మీరు ప్రమాదంలో పడ్డట్టే!

Periods

Periods

ప్రతి నెల స్త్రీలకు నెలసరి రావడం అన్నది తప్పనిసరి. ఒక వయసు నుంచి ఒక వయసు వరకు స్త్రీలకు కంటిన్యూగా ప్రతీ నెల పీరియడ్స్ అన్నది వస్తూ ఉంటాయి. అయితే కొంతమందికి రెండు మూడు నెలలకు ఒకసారి కూడా పీరియడ్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో అజాగ్రత్త చేయకూడదని వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని చెబుతూ ఉంటారు. అలాగే నెలలో రావాల్సిన సమయం కంటే కొంచెం లేటుగా వచ్చినా కూడా ఆ విషయం గురించి కాస్త ఆలోచించాలి అంటున్నారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పీరియడ్స్ కారణంగా ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయట.

కాగా కొంతమందికి మెనోపాజ్ తర్వాత కూడా కొద్దిగా బ్లీడ్ అవుతుంది. 40 ఏళ్ళ తర్వాత ఎక్కువగా బ్లీడింగ్, ఇరెగ్యులర్ పీరియడ్స్‌ని గమనించాలి. రెండు పీరియడ్స్ మధ్య వచ్చే బ్లీడింగ్‌ ని కూడా గమనించాలని చెబుతున్నారు. శృంగార సమయంలో రక్తస్రావం ఉన్నా కూడా అనుమాన పడాల్సిందే అంటున్నారు. అయితే కొందరికీ ఈ లక్షణాలు లేకుండానే క్యాన్సర్ వస్తుంది. కాబట్టి వైద్యులను సంప్రదించి చెక్ చేసుకోవడం మంచిది. ఈ పీరియడ్స్ విషయంలో ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని కలవాలి.

డాక్టర్స్ ప్రైమరీ టెస్ట్ తర్వాత పెల్విక్ అల్ట్రాసౌండ్ స్కాన్, ఎండోమెట్రియల్ బయాప్సీ, సర్వైకల్ బయాప్సీ వంటి సమస్యల్ని గుర్తించే టెస్టులు చేస్తారు. వ్యాధులని గమనిస్తే వీలైనంత త్వరగా ట్రీట్‌మెంట్ తీసుకోవడం కూడా మంచిదని చెబుతున్నారు. అలాగే ముందు చెప్పుకున్న లక్షణాలు కొన్నిసార్లు ఇతర కారణాల వల్ల కూడా రావచ్చట. మీరు లక్షణాలని గమనిస్తే కారణాన్ని కనుక్కోవాలి. దీనికోసం గైనకాలజిస్ట్‌ని కలవమని చెబుతున్నారు. ముందుగానే గుర్తించి ట్రీట్‌మెంట్ చేయడం చాలా ముఖ్యం. రెగ్యులర్ చెకప్స్, శరీరంలోని అన్ని మార్పులు రోగ నిర్ధారణకి తప్పనిసరిగా నిర్ధారించాల్సిన విషయాలు

note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.