Copper Sun Idol : ఈ రోజుల్లో వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. వాస్తు శాస్త్రాన్ని బాగా విశ్వసించే వారు ప్రతి ఒక్క విషయాన్ని తప్పకుండా పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం ఇది సరికాదని తెలిస్తే చాలు ఎలాంటి మార్పులు చేర్పులైనా చేసేస్తారు. అయితే ఇంటి నిర్మాణం, ఆ తర్వాత ఇల్లు సర్దుకునే విషయంలో మాత్రమే కాదు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. అలా వాస్తు విషయాలలో మార్పులు చేసుకోవడం వల్ల ఆర్థిక, మానసిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అలాగే వాస్తు ప్రకారంగా పాటించాల్సిన విషయాలలో రాగి సూర్యుడు (Coppor Sun) కూడా ఒకటి. మరి రాగి సూర్యుడిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re Now on WhatsApp. Click to Join.
రాగి సూర్యుడిని (Copper Sun) ఇంట్లో ఉంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఇది దుష్టశక్తులను తొలగించే వాస్తు నివారణలలో ఒకటిగా పరిగణించవచ్చని వాస్తు నిపుణులు చెబుతారు. రాగితో చేసిన లోహ సూర్యుడిని అద్భుతమైన వాస్తు హార్మోనైజర్ గా భావిస్తారు. దీని నుంచి అనేక ప్రయోజనాలు పొందొచ్చు. ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యుడిని నిత్యం పూజించడం ద్వారా జీవితంలో మెరుగైన ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. సూర్యుని ఆశీస్సులు పొందిన వారు తమను తాము శారీరకంగా, మానసికంగా మెరుగుపరచుకోవచ్చు.
వాస్తు శాస్త్రం ప్రకారం రాగి సూర్యుడిని (Copper Sun) ఇంట్లో ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. అలాగే రాగి సూర్యుడు ఇంట్లో ఉంటే మంచిదే అని ఏ దిశగా అంటే ఆ దిశగా ఉంచేయకూడదు. గోడలపై నిర్దిష్ట దిశలో ఉంచాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, రాగితో చేసిన సూర్యుడిని ఇంట్లో ఉంచడం వల్ల మీరు నివసించే ఇల్లు లేదా ఆఫీసులో మిగిలిన ప్రదేశాలలో కూడా మీకు తగిన గౌరవం దక్కుతుంది. రాగి సూర్యుడు వల్ల ప్రభావవంతమైన వ్యక్తులతో మీ సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాగి సూర్యుడికి బలమైన ఆకర్షణ శక్తి ఉందని, ఇది ప్రభావవంతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులను ఆకర్షిస్తుందని వాస్తు నిపుణులు అంటారు. మీ ఇంట్లో తూర్పు దిశలోని ఏదైనా మార్గంలో, తూర్పు గోడపై రాగి సూర్యుడిని ఉంచాలి. ఇలా చేయడం వల్ల లోపాలన్నింటినీ అధిగమించొచ్చు. ఇది మీ ఇంటికి శ్రేయస్సును పెంచుతుంది. అలాగే ప్రధాన ద్వారం తూర్పు దిశలో ఉంటే తలుపు వెలుపల రాగి సూర్యుడిని ఉంచడం వల్ల మీ ఇంట్లో సంపద పెరిగే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఆఫీసులో తూర్పు గోడపై రాగి సూర్యుడిని వేలాడదీయడం వల్ల మీ కెరీర్లో పురోగతి లభిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులు విజయం సాధిస్తారు.
Also Read: Banana Tips : డార్క్ సర్కిల్ తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే అరటి పండుతో ఇలా చేయాల్సిందే?