Site icon HashtagU Telugu

Lizard Falling : తలపై బల్లి పడితే.. కలలో బల్లి కనిపిస్తే ఏమవుతుందో తెలుసా ? 

Lizard Falling

Lizard Falling

Lizard Falling : ఇంట్లో బల్లులు సంచరించడం చూస్తే మనలో చాలామందికి గగుర్పాటు కలుగుతుంది.. 

కొంతమంది గదిలో బల్లి కనిపిస్తే,  లోపలికి వెళ్ళడానికి కూడా జంకుతారు.. 

హిందూ సంప్రదాయాల ప్రకారం శరీరంపై  ఎక్కడైనా బల్లి పడితే అది సానుకూల సంకేతమే. అయితే దీనికి షరతులు వర్తిస్తాయి. 

శకున శాస్త్రం ప్రకారం కొన్ని జీవులు మన జీవితంలో జరగబోయే శుభ, అశుభకర ఘటనల గురించి తెలియజేస్తాయి.

అలాంటి జీవుల్లో బల్లి కూడా ఒకటి. శకున శాస్త్రం ప్ర‌కారం బల్లి మీపై పడితే(Lizard Falling) ఏం జ‌రుగుతుందో తెలుసుకుందాం రండి.. 

ధనలాభం

ఆస్తి నష్టం 

అశుభం 

తలపైన బల్లి పడితే..

మగవాళ్ళకు కుడి వైపున బల్లి పడితే శుభం జరుగుతుందని చాలామంది విశ్వసిస్తారు. అదే స్త్రీలకు కుడి భాగంలో బల్లి పడితే అశుభం అని చెబుతారు. స్త్రీలకు ఎడమ వైపు బల్లి పడితే శుభం కలుగుతుందని నమ్ముతారు. పురుషులకు ఎడమ భాగం వైపు బల్లి పడితే అశుభ సూచకంగా పరిగణిస్తారు. ఇక ముఖం మీద బల్లి పడితే సంపద వస్తుందని, ఎడమ కంటి పై బల్లి పడితే శుభవార్త వినే అవకాశం ఉంటుందని చెబుతారు. బల్లి కుడి కంటి పై పడితే అనుకున్న పనులు పూర్తి కావు అని నమ్ముతారు. తల పైన బల్లి పడితే వివాదాలు తలెత్తే అవకాశం ఉందని, మరణ భయం వెంటాడుతుంది అని చాలామంది విశ్వసిస్తారు. అంతే కాదు తల పైన బల్లి పడితే రుణ భారం పెరుగుతుందని కూడా నమ్ముతారు.

కలలో బల్లి కనిపిస్తే.. 

మగవాళ్లకు కుడి చేతి పై బల్లి పడితే ఆర్ధిక నష్టం కలుగుతుందని, ఎడమ చేతి పై బల్లి పడితే అవమానం జరుగుతుందని, మీసాల పై బల్లి పడితే తీవ్రమైన కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు. తొడల మీద బల్లి పడితే వస్త్ర నష్టం జరుగుతుందని భావిస్తారు. కలలో బల్లి కనిపిస్తే ప్రభుత్వాలకు సంబంధించిన అనేక ఒత్తిడులను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆందోళన కలుగుతుందని నమ్ముతారు.

గమనిక: ‘ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.