Weekly Horoscope : రాశిఫలాలు అనేవి ప్రతిదినం మారుతాయి. ఫలితంగా ఒక్కో రోజులో ఒక్కో రాశి వారికి భిన్నమైన ఫలితాలు వస్తుంటాయి. కొందరికి సానుకూల ఫలితాలు, మరికొందరికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. రాశిఫలాలు తెలుసుకోవడం వల్ల ఆయా రాశుల వారు ముందుజాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 2025 ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 16 వరకు ఉన్న రాశిఫలాల(Weekly Horoscope) వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read :Made In Hyderabad : మేడిన్ హైదరాబాద్ యుద్ధ విమానం.. నేడే ‘ఏరో ఇండియా’లో ప్రదర్శన
మేషరాశి
ఈవారం మేషరాశిలోని యువతకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు శాలరీలు పెరుగుతాయి. జాబ్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఏదైనా సమస్య వస్తే జీవిత భాగస్వామితో, శ్రేయోభిలాషులతో చర్చించండి.
వృషభ రాశి
ఈవారం వృషభ రాశి వారి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. పాత అప్పులు వసూలు అవుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు రచిస్తారు. ఉద్యోగాల్లో ఉన్నవారు పురోగతి సాధిస్తారు.
మిథున రాశి
ఈవారం మిథున రాశి వారికి వ్యాపారాల్లో లాభాలు పండుతాయి. కొందరికి విదేశాల్లో జాబ్స్ వస్తాయి. అదనపు ఆదాయానికి తలుపులు తెరుచుకుంటారు. కుటుంబ సభ్యులతో మీకున్న వివాదాలకు తెరపడుతుంది. ఇతరుల గొడవల్లోకి తలదూర్చకండి. అనవసరంగా నోరు పారేసుకోవద్దు.
Also Read :YouTuber Vs SEBI: రూ.104 కోట్లు సంపాదించిన యూట్యూబర్.. ‘సెబీ’ బ్యాన్
కర్కాటక రాశి
ఈవారం కర్కాటక రాశి వారు చాలా ఓర్పుతో ఉండాలి. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు పనికి రావు. కొన్ని ఆకస్మిక ఘటనలు ఎదురవుతాయి. కంగారు పడొద్దు. ఓపికగా వ్యవహరించండి. ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారు శుభవార్తలు వింటారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి టైం.
సింహ రాశి
ఈవారం సింహరాశిలోని వ్యాపారులు నష్టాల నుంచి బయటికి వస్తారు. కొన్ని ఆర్థిక ఒత్తిళ్లు తొలగిపోతాయి. ప్రేమ వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాాాయి. పెళ్లిళ్లు కుదురుతాయి. ఉద్యోగాల్లో ఉన్నవారికి ఊహించని పురోగతి లభిస్తుంది.
కన్యా రాశి
ఈవారం కన్యా రాశివారు అనవసర ఖర్చులు అతిగా చేస్తారు. దుబారాకు దూరంగా ఉంటే మంచిది. పాత అప్పులను వసూలు చేసుకుంటారు. జాబ్‌లో పదోన్నతి దిశగా వెళ్తారు. పెళ్లి వ్యవహారాలకు ఆటంకాలు కలుగుతాయి.
తులా రాశి
ఈవారం తులా రాశి వారికి ఆకస్మికంగా చేతికి డబ్బులు అందుతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. వ్యాపారంలో జరుగుతున్న లోటుపాట్లు మీకు అర్థం అవుతాయి. వాహనం నడిపే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అతివేగం ప్రమాదకరం. ఆస్తి విషయాల్లో మీకు అనుకూల ఫలితం వస్తుంది.
వృశ్చిక రాశి
ఈవారం వృశ్చిక రాశివారు ఆర్థిక లావాదేవీల విషయంలో అలర్ట్‌గా ఉండాలి. లేదంటే ఇబ్బందులు, నష్టాలు ఎదురవుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కొందరు శత్రువులు మిత్రులుగా మారిపోయి సహకారం అందిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ఇతరులను జోక్యం చేసుకోనివ్వొద్దు. ఏవైనా పనులకు ఆటంకం వాటిల్లితే.. సంయమనం పాటించండి. భవిష్యత్తులో సమయం కలిసొస్తుంది. ఆస్తి వ్యవహారంలో అనుకూలంగా ఫలితం వస్తుంది.
ధనుస్సు రాశి
ఈవారం ధనుస్సు రాశివారు రుణబాధల వలయం నుంచి బయటికి వస్తారు. కొత్త వ్యాపారం కోసం ప్రణాళిక రచిస్తారు. వ్యాపారంలో ఇప్పటికే అనుభవం ఉన్నవారి సలహాలు, సహకారం తీసుకోండి. డబ్బు విషయంలో ఎవరికీ హామీలు ఇవ్వకండి.
మకర రాశి
ఈవారం మకర రాశి వారికి పాత అప్పు బకాయిలు చేతికి అందుతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. విదేశాల్లో చదువుకునే అవకాశాలు దక్కుతాయి. ఉద్యోగంలో పదోన్నతి దక్కొచ్చు.
కుంభరాశి
ఈవారం కుంభరాశి వారు స్టాక్ మార్కెట్‌లో లాభాలను పండించుకుంటారు. అయితే అత్యధిక స్థాయుల్లో పెట్టుబడులు పెట్టొద్దు. కొత్త వ్యాపారాల కోసం అత్యుత్సాహం వద్దు. ఉన్న వ్యాపారాన్నే విస్తరించండి. ఉద్యోగం మారేందుకు మంచి టైం.
మీనరాశి
ఈవారం మీనరాశి వారికి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అయినా మనోస్థైర్యాన్ని వదలొద్దు. మీపై మీకు నమ్మకం ఉండి తీరాలి. దైవ బలం కోసం పూజలు చేయండి. కొందరికి సంతాన ప్రాప్తి లభిస్తుంది. కొత్త వాహనాలు కొంటారు. అప్పులు తీరుతాయి.