Weekly Horoscope : డిసెంబరు 09 (సోమవారం) నుంచి డిసెంబరు 15 (ఆదివారం) వరకు గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను ఈకింది విధంగా అంచనా వేశారు.
వృషభ రాశి
ఈవారం వృషభ రాశి వారి ఆదాయానికి (Weekly Horoscope) ఆటంకం కలిగే ఛాన్స్ ఉంది. అనవసర ఖర్చులు చేయాల్సి రావచ్చు. మీ శత్రువులు మీపై పెత్తనం కోసం ప్రయత్నాలు చేస్తారు. మీకు గురువారం నుంచి టైం కలిసొస్తుంది.
కన్యా రాశి
ఈవారం కన్యారాశి వారు మంగళ, బుధ వారాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం తక్కువే వస్తుంది. అయితే వీకెండ్‌లోగా మళ్లీ మంచి టైం మొదలవుతుంది. ఎవరైనా సలహాలు అడిగితే ఇవ్వకండి.
Also Read : Mee Seva App : నేడే విడుదల.. 150 రకాల పౌరసేవలతో ‘మీసేవ’ యాప్
తులా రాశి
ఈవారం తులారాశి వారు గురువారం, శుక్రవారం రోజు కొంత మానసిక వేదనకు లోనయ్యే అవకాశం ఉంది. అయినా ధైర్యంగా ఉండాలి. ఆర్థిక సమస్యలు తీరబోతున్నాయి. కొన్ని విజయాలు రాబోతున్నాయి.
వృశ్చిక రాశి
ఈవారం వృశ్చిక రాశి వారికి, మంగళవారం, బుధవారం కలిసొస్తాయి. కొత్త ఆస్తులు కొంటారు. ఇతరులపై భారీ అంచనాలు పెట్టుకోకండి. మీ శత్రువులను ఓడిస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.
Also Read :Syrian Rebels: సిరియాలో ఉద్రిక్తత పరిస్థితులు.. దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు?
మకర రాశి
ఈవారం మకర రాశి వారికి మంగళ, బుధవారాల్లో ఖర్చులు పెరుగుతాయి. ఆ రెండు రోజుల్లో కొన్ని సమస్యలు కూడా రావచ్చు. ఆదాయం తగ్గే సూచనలు ఉన్నాయి. మీ అప్పులు తీరే మార్గాలు కనిపిస్తాయి. మానసిక వేదన కలిగినా ధైర్యం కోల్పోవద్దు.
కుంభ రాశి
ఈవారం కుంభరాశిలోని పలువురికి పూర్వీకులు ఆస్తులు వస్తాయి. అయితే గురువారం, శుక్రవారం కొంత నెగెటివిటీ ఎదురవుతుంది. ఖర్చులు అతిగా చేస్తారు. దుబారాకు దూరంగా ఉండండి. కొన్ని పనులు లేట్ అవుతాయి.
మీన రాశి
ఈ వారం మీన రాశి వారికి మొండి అప్పులు తిరిగొస్తాయి. కొత్త అవకాశాలతో ఆర్థికంగా ఎదుగుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు కలిసొస్తుంది.
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.