Weekly Horoscope : రాశిఫలాలు అనేవి ప్రతిదినం మారుతుంటాయి. ఫలితంగా ఒక్కో రోజు ఒక్కో రాశి వారికి భిన్నమైన ఫలితాలు వస్తాయి. కొందరికి సానుకూల ఫలితాలు, మరికొందరికి ప్రతికూల ఫలితాలు దక్కుతాయి. రాశిఫలాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వల్ల ఆయా రాశుల వారు ముందుజాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 2025 మే 25 నుంచి మే 31 వరకు ఉన్న రాశిఫలాల వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
మేషరాశి: ఈ వారం మేషరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. అయితే దుబారా ఖర్చులను ఆపాలి. వారం మధ్యలో ఒక గుడ్ న్యూస్ వింటారు. మాససిక సమస్యల నుంచి రిలీవ్ అవుతారు. గతంలో ఆగిపోయిన కొన్ని పనులు మళ్లీ ప్రారంభం అవుతాయి. కొత్తగా అవకాశాలు వస్తాయి. వాటిని వదులుకోవద్దు. వాహనం డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అతివేగం అనర్ధాలకు దారి తీస్తుంది.
వృషభ రాశి: ఈ వారంలో వృషభ రాశివారికి లక్ కలిసొస్తుంది. సంపదలు(Weekly Horoscope) పెరుగుతాయి. పూర్వీకుల ఆస్తులు కలిసి రావొచ్చు. అయితే అత్యాశను వదిలేయండి. బంధాలకు విలువ ఇవ్వండి. ఆత్మీయులను వదులుకోవద్దు. దీర్ఘకాలంలో ఎంతో పురోగతి సాధిస్తారు. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. గృహ లాభం కలగొచ్చు.
Also Read :KTR Vs Kavitha : కేటీఆర్ పట్టాభిషేకం ఆగినట్టేనా.. కవితకు కీలక పదవి ఇవ్వబోతున్నారా ?
మిథునరాశి: ఈ వారంలో మిథున రాశి వారు వీలైనంత తక్కువగా మాట్లాడితే బెటర్. అతిగా మాట్లాడొద్దు. వ్యాపార భాగస్వాములు, ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు ప్రతీ పదం విషయంలో జాగ్రత్త వహించండి. సమయ స్ఫూర్తి, సహనంతో ఆపదలను గట్టెక్కండి. మీ నిర్ణయాలను వాయిదా వేయొద్దు. మంచే జరుగుతుందని ఊహించుకోండి. పనిపై ఏకాగ్రత పెంచుకోండి. ఆటంకాలను సృష్టించే వాళ్లపై ఓ కన్నేసి ఉంచండి.
కర్కాటక రాశి: ఈ వారంలో కర్కాటక రాశి వారికి కొన్ని కోరికలు నెరవేరుతాయి. ఆపదల నుంచి బయటపడతారు. అప్పులు తీరుతాయి. పాత అప్పులు వసూలు అవుతాయి. పూర్వీకులు ఆస్తులు కలిసి రావొచ్చు. దుబారా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు జాగ్రత్త వహించండి. వారం మధ్యలో ఒక గుడ్ న్యూస్ వింటారు.
Also Read :AP Liquor Scam: ‘మ్యూల్ ఖాతా’లతో లిక్కర్ మాఫియా దొంగాట!
సింహరాశి: ఈ వారంలో సింహ రాశి వారికి లక్ కలిసొస్తుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. మానసిక ఒత్తిడి వెంటాడే ముప్పు ఉంది. దైవ ధ్యానానికి సమయాన్ని పెంచండి. ఉద్యోగులకు మంచి టైం వస్తుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచిటైం. అయితే నిపుణుల సలహాలు తీసుకోండి.
కన్య రాశి: ఈ వారంలో కన్య రాశి వారు వ్యక్తిగత జీవితాల్లో, వ్యాపారాల్లో అలర్ట్‌గా ఉండాలి. చెప్పుడు మాటలు విని, ఇతరులను అనవసరంగా అపార్ధం చేసుకోవద్దు. ఇతరులపై అనుమానాలు పెంచుకోవద్దు. ఇతరులపై చర్యలు తీసుకునే ముందు, నిజాన్ని నిర్ధారణ చేసుకోండి. అప్పులు పెరిగే ముప్పు ఉంది. అతిగా లోన్లు తీసుకోవద్దు. పెళ్లి వ్యవహారాలు ఫలిస్తాయి. కొత్త వ్యాపారాలు సఫలం అవుతాయి.
తుల రాశి: ఈ వారంలో తుల రాశి వారికి మంచి టైం వస్తుంది. అయితే ఆర్థిక విషయాల్లో అలర్ట్‌గా ఉండాలి. అప్పులు చేయొద్దు. దుబారా ఖర్చులు మానేయాలి. అదనపు ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. అత్యాశకు పోకండి. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. పూర్వీకుల ఆస్తి కలిసి రావొచ్చు. అవార్డులు వచ్చే అవకాశం ఉంది. చిన్నపాటి అవరోధాలు ఎదురు కావచ్చు. సహనంతో ఈ సమయాన్ని అధిగమించండి.
వృశ్చిక రాశి: ఈ వారంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు లాభాలు వస్తాయి. కాంట్రాక్టర్లకు మంచి టైం మొదలవుతుంది. దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి. ఆన్‌లైన్ లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. సైబర్ దాడుల ముప్పు ఉంది. ఇతరులు కవ్వించే ప్రయత్నం చేసినా ఆవేశపడొద్దు. ఎవరినీ కించపరచి మాట్లాడొద్దు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కొందరు మీ ఓర్పును పరీక్షిస్తారు.
ధనుస్సు రాశి: ఈ వారంలో ధనుస్సు రాశి వారికి లక్ కలిసొస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో రాణిస్తారు. లాభాలు పండుతాయి. పెట్టుబడులు కలిసొస్తాయి. పాత స్నేహితులను కలుసుకుంటారు. పాత అప్పులు వసూలవుతాయి. ఆఫీసులో ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అప్పుల బాధలు తీరుతాయి.
మకరరాశి: ఈ వారంలో మకర రాశి వారికి కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వారిని గుడ్డిగా నమ్మొద్దు. మోసపోయే ముప్పు ఉంది. కాళ్లకు దెబ్బలు తగలకుండా చూసుకోండి.శుక్రయోగం వల్ల ఆదాయం పెరుగుతుంది. లాభాలు పెరుగుతాయి. పనుల్ని వాయిదా వేయకండి. అందరితోనూ స్నేహంగా మెలగండి. ఆలోచనల్ని పక్కదారి పట్టించకండి.
కుంభరాశి: ఈ వారంలో కుంభరాశి వారికి మంచి టైం వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. కొత్త జాబ్ ఆఫర్స్ వస్తాయి. ఆచితూచి ఆఫర్స్‌ను ఎంపిక చేసుకోండి. లేదంటే చిక్కుల్లో పడతారు. ఆరోగ్య సమస్యలు బయటపడొచ్చు. వైద్యులను సంప్రదించండి.భవిష్యత్తు గురించి ప్లానింగ్ చేసుకోండి. కుటుంబానికి ఉపయోగపడే ఏర్పాట్లు చేయండి. దైవబలం, మనోబలంతో మానసిక ఒత్తిడిని జయించండి.
మీన రాశి: ఈవారంలో మీన రాశిలోని ఉద్యోగులు, వ్యాపారులకు శుభాలు జరుగుతాయయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. బాగానే లాభపడతారు. కొన్ని ఆటంకాలు తొలగిపోయి, రిలాక్స్‌డ్‌గా ఫీలవుతారు. ఇతరుల వివాదాలలో తలదూర్చకండి. వివాదాస్పదంగా ఇతరులతో మాట్లాడొద్దు.
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.