Site icon HashtagU Telugu

Weekly Horoscope : వారఫలాలు.. మార్చి 9 నుంచి మార్చి 15 వరకు రాశిఫలాలను తెలుసుకోండి

Weekly Horoscope 2025 March Astro Predictions Zodiac Signs Pisces Sun Signs Astrology

Weekly Horoscope : రాశిఫలాలు అనేవి ప్రతిదినం మారుతుంటాయి. ఫలితంగా ఒక్కో రోజు ఒక్కో రాశి వారికి భిన్నమైన ఫలితాలు వస్తాయి. కొందరికి సానుకూల ఫలితాలు, మరికొందరికి ప్రతికూల ఫలితాలు దక్కుతాయి. రాశిఫలాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వల్ల ఆయా రాశుల వారు ముందుజాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 2025 మార్చి 9 నుంచి మార్చి 15  వరకు ఉన్న రాశిఫలాల వివరాలను ఈ కథనంలో  తెలుసుకుందాం.

Also Read :Bird Flu Outbreak : వేలాది కోళ్ల మృత్యువాత.. తెలంగాణలో బర్డ్ ఫ్లూ కొనసాగుతోందా ?

మేషం

ఈవారంలో మేషరాశి వారు 2 శుభవార్తలు(Weekly Horoscope)  వింటారు. తొందరపాటుతో ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే నష్టమే జరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. పెళ్లి సంబంధం సెట్ అవుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

వృషభం

ఈవారంలో వృషభ రాశిలోని పలువురు ప్రేమలో పడతారు. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ రావొచ్చు. కొత్త వ్యాపారం షురూ చేయడానికి మంచి టైం ఇది. కుటుంబీకులతో సహనంతో వ్యవహరించండి.

మిథునం

ఈవారంలో మిథున రాశిలోని పలువురు ఉద్యోగంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. ఆస్తివివాదాల్లో తొందరపడితే నష్టం తప్పదు. పెద్దల సలహా తీసుకోండి. మీ బలం పెంచుకోండి. ఆర్థిక పరిస్థితి అకస్మాత్తుగా బాగు పడుతుంది. దుబారా ఖర్చులు చేయొద్దు.

కర్కాటకం

ఈవారంలో కర్కాటక రాశి వారికి మొండిబాకీలు వసూలు అవుతాయి. బంగారం కొంటారు. పెళ్లి సంబంధం సెట్ అవుతుంది. ఆస్తి వివాదం కొలిక్కి వస్తుంది. ఇళ్లు , వాహనాలు కొనేందుకు ప్రయత్నాలను ప్రారంభిస్తారు. అందుకు ఇది మంచి సమయమే. పిల్లలను చదువులో ప్రోత్సహించండి.

సింహం

ఈవారంలో సింహ రాశి వారి వ్యాపారాలు ఆకస్మిక లాభాలు పండిస్తాయి. జీవిత భాగస్వామితో గొడవలు వద్దు. సహనం అవసరం. కొత్త ఉద్యోగ ఆఫర్లు మీ తలుపు తడతాయి. ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఎవరికీ అప్పులు ఇవ్వొద్దు. తొందరపాటుతో పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థిక లావాదేవీలు తగ్గిస్తే మేలు. కుటుంబ సభ్యుల్లో  ఒకరి ప్రవర్తన కారణంగా నిరాశ పడతారు.

Also Read :Telangana NDA : తెలంగాణలోనూ తెరపైకి ఎన్డీయే కూటమి?

కన్య

ఈవారంలో కన్య రాశి వారి పెండింగ్ పనులు పూర్తవుతాయి. బంధువుల నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది. కోర్టు కేసులు సాల్వ్ అవుతాయి. ఆదాయం ఒక్కసారిగా పెరుగుతుంది. అలా అని దుబారా ఖర్చులు చేయొద్దు. రిచ్ క్లాస్ పెళ్లి సంబంధం దొరుకుతుంది. డబ్బును మాత్రమే చూడొద్దు. చిన్ననాటి స్నేహితులు సాయం చేస్తారు.

తుల

ఈవారంలో తుల రాశి వారి ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆస్తి వివాదాలు తీరుతాయి. కోర్టు కేసులు  పరిష్కారం అవుతాయి. డబ్బు వస్తుంది.  వృథా ఖర్చులు చేయొద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త.  తొందరపడి ఉద్యోగం మారొద్దు.

వృశ్చికం

ఈవారంలో వృశ్చిక రాశి వారు కొత్త వ్యాపారం షురూ చేస్తారు. ఇప్పటికే ఉన్న వ్యాపారంలో కీలక మార్పులు చేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి కలిసి వస్తుంది. రాజకీయాల్లో ఉన్నవారికీ ఇది మంచి టైం. తొందరపడి మాట్లాడితే అవకాశం కోల్పోతారు.. జాగ్రత్త ! ప్రయోజనం ఆశించకుండా అందరితో కలిసి పనిచేయండి. ఫలితం దానంతట అదే వస్తుంది.

ధనుస్సు

ఈవారంలో ధనుస్సు రాశిలోని ఉద్యోగుల శాలరీలు పెరుగుతాయి. పదోన్నతలు రావొచ్చు.  కొత్త ఉద్యోగ ఆఫర్లు వస్తాయి. జాబ్ మారే విషయంలో తొందరపడొద్దు.  ఆదాయం పెరగొచ్చు. చెడు పరిచయాలను వదిలేయండి. లేదంటే చిక్కుల్లో పడతారు. సొంతింటి ప్రయత్నాలు మొదలుపెట్టడం మంచిది.

మకరం

ఈవారంలో మకర రాశి వారు చేపట్టే పనులు పూర్తవుతాయి. అప్పులు తీరుతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. మీ స్కిల్స్ పెంచుకునే ప్రక్రియను మొదలుపెట్టేందుకు ఇది సరైన సమయం. వ్యాయామం చేయండి. శారీరక శక్తిని పెంచుకోండి. దైవ ధ్యానంతో దైవ బలం లభిస్తుంది.

కుంభం

ఈవారంలో కుంభ రాశివారు బంగారం కొంటారు. భూములు కొంటారు. అయితే ఆచితూచి దీనిపై నిర్ణయాలు తీసుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఇతరులతో వైరం వద్దు. రుణాలు మంజూరవుతాయి. కొత్త వ్యాపారం చేయాలనుకునే వారికి తలుపులు తెరుచుకుంటాయి.

మీనం

ఈ వారంలో మీన రాశిలోని ఉద్యోగులకు కాలం కలిసొస్తుంది. అనుకోకుండా గుర్తింపు దక్కొచ్చు. క్రమశిక్షణ, నిలకడతనం, సమయ పాలన, సహనం ఉంటే చాలు.  ఏ రంగంలోనైనా రాణిస్తారు. ఉద్యోగులకు శాలరీ పెరగొచ్చు. అదనపు ఆదాయం కూడా చేకూరుతుంది.

గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.