Astrology : గురువారం పసుపు రంగు దస్తులు ధరించాలా, అలా చేస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుందా..!!

గురువారం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది.గురువారం విష్ణువు, బృహస్పతితో సంబంధం కలిగి ఉంటుంది.

  • Written By:
  • Publish Date - September 15, 2022 / 06:00 AM IST

గురువారం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది.గురువారం విష్ణువు, బృహస్పతితో సంబంధం కలిగి ఉంటుంది. ఒక వ్యక్తి జాతకంలో గురుగ్రహానికి సంబంధించిన దోషంఉంటే, ధనం కొరత ఏర్పడుతుంది, పురోగతికి అన్ని దారులు మూసుకుపోతాయి, వివాహానికి ఆటంకాలు, వ్యాపారాలకు ఆటంకం ఏర్పడుతుంది. అలాంటి వారు గురువారం నాడు శ్రీమహావిష్ణువును పూజించాలి. జ్యోతిష్యశాస్త్రంలో బృహస్పతి శుభ గ్రహంగా చెప్పబడింది. ఆధ్యాత్మిక పురోగతితో పాటు, సంపద, శ్రేయస్సు, కీర్తి ప్రతిష్టలు, జ్ఞానాన్ని ప్రసాదించే గ్రహం. కొన్ని ప్రత్యేక విషయాలను దృష్టిలో ఉంచుకుని పూజ చేస్తే, దాని సానుకూల ప్రభావం త్వరలో కనిపిస్తుంది.

కుంకుమపువ్వు పాయసం నైవేద్యం పెట్టండి..
ఒక వ్యక్తి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లయితే, గురువారం నాడు అన్నం పాయసం తయారు చేసి, అందులో కుంకుమ వేసి, ఈ పాయసం శ్రీ మహా విష్ణువుకి సమర్పించండి.

అరటి మొక్కను పూజించండి
గురువారాల్లో మర్రిచెట్లను పూజించాలనే నియమం శాస్త్రాలలో ఉంది. గురుదేవ్ బృహస్పతి అరటి చెట్టుతో సంబంధం కలిగి ఉంటాడు. కాబట్టి ఈ రోజు అరటి మొక్కకు ఏడుసార్లు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. మీరు కెరీర్‌లో ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నట్లయితే, అరటి చెట్టుకు ఏడు సార్లు ప్రదక్షిణలు చేసి, ఆపై అరటి చెట్టుకు నీరు సమర్పించండి.

గురువారం రోజున అరటి చెట్టు వేరును తీసుకుని పసుపు గుడ్డలో కట్టి మెడలో ధరించాలి. ఇలా చేయడం వల్ల ధనానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోవడంతో పాటు విద్యారంగంలోని సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అలాగే ఈ పరిహారాన్ని చేయడం వల్ల శ్రీ మహా విష్ణువు సంతోషిస్తాడు.

విద్యారంగంలో మీరు ఆశించిన ఫలితాన్ని పొందాలంటే, ఈ రోజున మీ గురువు ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోవద్దు. అంతేకాదు, ఎవరికైనా వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే, అలాంటి వారు కూడా ఈ ఉపాయం ప్రయత్నించవచ్చు.

గురువారం పసుపు రంగు దుస్తులు ధరించండి
గురువారాల్లో పసుపు వస్త్రాలు ధరించి విష్ణుమూర్తిని పూజించండి మరియు ఆశించిన ఫలితాలు పొందుతారు. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి ప్రత్యేక అనుగ్రహం మీకు లభిస్తుంది.