Site icon HashtagU Telugu

Vastu Tips: మీ ఇంట్లో బంగారు నగలు ఉన్నాయా.. అయితే ఈ వాస్తు చిట్కాలు పాటించాల్సిందే?

Mixcollage 28 Feb 2024 04 55 Pm 8746

Mixcollage 28 Feb 2024 04 55 Pm 8746

వాస్తుశాస్త్రంలో బంగారంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. దీన్ని అత్యంత పవిత్రమైనదిగా, శక్తివంతమైనదిగా వాస్తు శాస్త్ర నిపుణులు భావిస్తారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే బంగారు నగల విషయంలో కొన్ని వాస్తు చిట్కాలు పాటించడం ద్వారా సంపదను పెంపొందించుకోవచ్చు. మరి బంగారు నగల విషయంలో ఎటువంటి వాస్తు చిట్కాలు పాటించాలి అన్న విషయానికి వస్తే.. పవిత్రంగా భావించే పుత్తడికి వాస్తుశాస్త్ర నిపుణులు అత్యంత ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఏ ఇంటి వాస్తునైనా పరిశీలించేటప్పుడు ఆ కుటుంబంలో బంగారానికి తగిన విలువ ఇస్తున్నారో? లేదో? పరిశీలిస్తారు.

ఎందుకంటే స్వర్ణాన్ని పట్టించుకోకపోతే ఆ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశిస్తుందని, నెగెటివ్ ఎనర్జీవల్ల ఉన్న బంగారం తాకట్టుపాలవగలదు. కుటుంబ సభ్యులు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. బంగారాన్ని ఎల్లప్పుడూ ఇంట్లో ఆగ్నేయ దిశలో ఉంచాలి. ఇది శ్రేయస్సు, సంపద, అదృష్టం తెస్తుందని నమ్ముతారు. బంగారాన్ని ఇంటి ఆగ్నేయ మూలలో ఉంచేటప్పుడు లాకర్‌లో భద్రపరచాలి. ఇది మీ సంపదను రక్షించడానికి, దొంగతనాన్ని నిరోధించడానికి సహాయపడుతుంది. వాస్తు ప్రకారమైతే బంగారు ఆభరణాలు ధరించి నిద్ర పోవడంకానీ, ఈత కొట్టడం కానీ, గిన్నెలు కడగడంవంటివి చేయకూడదు. నగదు ధరించేవారి పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బంగారాన్ని నడుముకి పైనే ధరించాలి. నడుము నుంచి పాదాలవరకూ ఎక్కడా ధరించకూడదు. అలా చేస్తే దురదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. బంగారు బహుమతులు ఇచ్చే సమయంలో 3, 5, 7, లేదా 9 వంటి బేసి సంఖ్యల ముక్కలను ఇవ్వడం ఉత్తమం. ఇది గ్రహీతకు అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. బంగారాన్ని ఎప్పుడూ శుభ్రంగా, పాలిష్‌ చేసి ఉంచాలి. ఇది దాని పాజిటివ్ ఎనర్జీని మెరుగుపరుస్తుంది. సంపద, శ్రేయస్సును ఆకర్షిస్తుంది. వాస్తు శాస్త్రంలో చాలా పవిత్రమైన లోహం బంగారం ఈ నియమాలను అనుసరించడం వల్ల మీ ఇంటికి, జీవితానికి సంపద, శ్రేయస్సు, అదృష్టం కలిసివస్తుంది. అదృష్టం కలిసొస్తుంది.