దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి తన భక్తుల ఇంటికి వస్తుందని నమ్ముతారు. అందుకే వాస్తుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. దీపావళి పండగ గురించి వాస్తు శాస్త్రంలో వివరంగా వివరించబడింది. హిందూ మతంలో దీపావళి పండుగ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఏడాది అక్టోబర్ 24న దీపావళి జరుపుకోనున్నారు. ఈ రోజున వినాయకుడిని, లక్ష్మీ దేవిని పూజించడం వల్ల భక్తులకు విశేష ప్రయోజనాలు చేకూరుతాయని శాస్త్రాలలో చెప్పబడింది. కానీ వాస్తు శాస్త్రంలో, తెలుసుకోవలసిన ముఖ్యమైనవిగా పరిగణించబడే కొన్ని విషయాలు ప్రస్తావించబడ్డాయి. అవేంటో తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం దీపావళి రోజున మీరు 4 జంతువులను చూస్తే, లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. వాస్తు శాస్త్రంలో ఈ 4 జంతువుల గురించి వివరంగా ఉంది. దీపావళి రోజున వాటిని చూడటం శుభప్రదంగా భావిస్తారు.
పిల్లి ఇంటికి వస్తే:
పిల్లిని చూడటం దురదృష్టకరంగా భావిస్తాం. కానీ దీపావళి రోజున, పిల్లి అకస్మాత్తుగా ఇంటికి వస్తే, లక్ష్మీదేవి కృప మీపై కురిపిస్తుందని అర్థం.
బల్లి కనిపిస్తే:
ఇంటి గోడలపై బల్లులు రావడం సర్వసాధారణం. కానీ దీపావళి రోజు రాత్రి బల్లి కనిపిస్తే అది చాలా శుభప్రదంగా భావిస్తారు . ఇది లక్ష్మీదేవి ఆనందానికి చిహ్నంగా పరిగణించబడుతుంది.
గుడ్లగూబ కనిపిస్తే:
దీపావళి రోజున గుడ్లగూబలు కనిపించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే గుడ్లగూబ లక్ష్మీ దేవి వాహనం. గుడ్లగూబను చూడటం సంపద, శ్రేయస్సును సూచిస్తుంది.
ఆవు:
దీపావళి రోజున కుంకుమపువ్వు రంగులో ఉన్న ఆవును చూస్తే, అది ఐశ్వర్యానికి సంకేతంగా భావిస్తారు. హిందూ మతంలో ఆవుతో తల్లితో సమానం. ఇది మీకు చాలా శుభప్రదంగా భావిస్తారు.