మామూలుగా చాలామంది దేవుడు ఉన్నట్టే దెయ్యాలు కూడా ఉన్నాయని నమ్ముతూ ఉంటారు. అందుకే అప్పుడప్పుడు దుష్టశక్తులు పట్టి పీడిస్తున్నాయని దయ్యం పట్టిందని అంటూ ఉంటారు. ఈ క్రమంలోనే అలాంటి వారు తమ దగ్గరకు దుష్ట శక్తులు రాకుండా తాయత్తులు కట్టుకోవడం, దేవుళ్ల ఫొటోలు దగ్గర ఉంచుకోవడం, ఇతర పనులు చేస్తుంటారు. అయితే దుష్ట శక్తుల బారిన పడకుండా ఉండేందుకు ఇవే కాదు, ఇంకా కొన్ని రకాల సూచనలు కూడా ఉన్నాయట. వాటిని పాటిస్తే దుష్ట శక్తులే కాదు, నెగెటివ్ ఎనర్జీ కూడా దగ్గరకు రాదని చెబుతున్నారు. మరి దుష్టశక్తులు దరి చేరకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తులసి ఆకులను కొన్నింటిని తీసుకుని వాటి నుంచి రసం తీయాలి.. తర్వాత దాని శుభ్రమైన మంచినీటిలో కలపాలి. ఆ తర్వాత ఇష్ట దైవాన్ని ప్రార్థించి ఆ ద్రవాన్ని ఇంట్లో చల్లాలి. ఈ విధంగా చేస్తే దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అలాగే ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ కూడా పోతుంది. అలాగే కనీసం ఏడాదికి ఒక్కసారైనా ఇంట్లో పండితుల చేత యజ్ఞం చేయించడం మంచిది. ఇలా చేయడం వల్ల వారు చదివే మంత్రాలకు యజ్ఞం నుంచి వచ్చే పొగకు దుష్ట శక్తులు ఏమైనా ఉంటే అవి పారిపోతాయి. అప్పుడు అంతా మంచే జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే ధనాన్ని కూడా ఇది ఆకర్షిస్తుంది. కనీసం వారానికి ఒక్కసారైనా ఇంట్లో అంతా ప్రసరించే విధంగా ధూపం వేయాలని చెబుతున్నారు. ఇందుకోసం నిప్పులపై కొంచెం ఇంగువ వేయాలి.
అయి ఇంకొక వేసిన తర్వాత ఇల్లు అంతా ప్రసరించే విధంగా తిరుగుతూ ధూపం వేయడం వల్ల ఇంట్లో దుష్టశక్తులు ఉండవు. అలాగే కొద్దిగా జీలకర్ర ఉప్పు కొద్దిగా తీసుకొని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ఇంటి ప్రధాన ద్వారం ఎదుట చల్లాలి. తరువాత మిగిలిన తలుపులు, కిటికీల వద్ద కూడా ఆ మిశ్రమాన్ని చల్లితే ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.. ఇతరులకు సహాయం చేయడం, దాన, ధర్మాలు చేయడం, దైవ ప్రార్థనలు చేయడం ఇతరులకు సహాయం చేయడం, దాన, ధర్మాలు చేయడం, దైవ ప్రార్థనలు చేయడం వంటి పనులు చేసే వారిని దుష్ట శక్తులు బాధించవట. అవే కాదు, నెగెటివ్ ఎనర్జీ కూడా వారి దరికి చేరదట. స్నానం చేసిన తర్వాత రోజూ ఇంట్లో ఉదయం, సాయంత్రం వేళల్లో దీపం పెడితే దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవట. హిందుమతంలో ఒక ముఖ్యమైన సింబల్ స్వస్తిక్. ఇది సూర్యునికి, శక్తి సంకేతం. కాబట్టి, స్వస్తిక్ గుర్తును ఇంటి ప్రదాన ద్వారం లేదా గోడల మీద రాయాలి.