Lakshmi Blessings : లక్ష్మీ అనుగ్రహం పొందాలనుకుంటున్నారా.. అయితే వెంటనే ఈ అలవాట్లను మానుకోండి?

ఇల్లును శుభ్రంగా ఉంచుకోని వాళ్లు, రోగాల బారిన పడిన వాళ్లు, స్నానం చేయని వాళ్లు, విడిచిన బట్టలనే ధరించే వాళ్ల దగ్గర లక్ష్మీదేవి (Lakshmi) అస్సలు ఉండదు.

Published By: HashtagU Telugu Desk
Want To Get Blessings Of Lakshmi.. But Avoid These Habits Immediately..

Want To Get Blessings Of Lakshmi.. But Avoid These Habits Immediately..

Goddess Lakshmi Blessings : మామూలుగా ప్రతి ఒక్కరూ లక్ష్మిదేవి అనుగ్రహం కలగాలి అని ఎన్నో రకాల నియమాలు, పరిహారాలు పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని చేసినా కూడా లక్ష్మీదేవి (Lakshmi) అనుగ్రహం కలగలేదని దిగులు చెందుతూ ఉంటారు. అయితే వాటన్నింటినీ పాటించడంతో పాటు మనిషిలో ఉండే కొన్ని చెడు అలవాట్లు మానుకోవడం వల్ల కూడా లక్ష్మీదేవి (Lakshmi) అనుగ్రహం లభిస్తుందట. చెడు అలవాట్లను అలాగే పెట్టుకొని ఎన్ని పూజలు చేసిన అవి వ్యర్థమే అంటున్నారు పండితులు. మరి ఎటువంటి అలవాట్లను మానుకుంటే లక్ష్మి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

అయితే లక్ష్మీదేవిని పూజించే ముందు ఇల్లు మొత్తం శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లును శుభ్రంగా ఉంచుకోని వాళ్లు, రోగాల బారిన పడిన వాళ్లు, స్నానం చేయని వాళ్లు, విడిచిన బట్టలనే ధరించే వాళ్ల దగ్గర లక్ష్మీదేవి అస్సలు ఉండదు. అదేవిధంగా తరచూ గొడవలు జరిగాయి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నివసించదు. కాబట్టి ఇంట్లో ఎప్పుడూ కొట్లాడుకోవడం కాకుండా ప్రేమానురాగాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. కొందరు పెద్దలను అవమానిస్తుంటారు. వృద్ధులను పట్టించుకోరు. అటువంటి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదట. అందుకే పెద్దలను గౌరవించాలి అంటుంటారు.

అలాగే వృద్ధులను ప్రేమగా చూసుకొని వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అలాగే చేతగాని వాళ్లపై ప్రతాపం చూపించే వాళ్లను కూడా లక్ష్మీదేవి అనుగ్రహించదు. వృద్ధులను, పెద్దలను గౌరవించే వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాగే ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తిని అవమానించే విధంగా మాట్లాడడం, వారిని చులకన చేసి చూడడం లాంటివి చేయకూడదు. కాబట్టి ఎల్లప్పుడూ నలుగురితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇలాంటి మంచి అలవాట్లు ఉన్న వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది.

Also Read:  Salt : ఉప్పుతో మీ ఇంట్లో ఇలా చేస్తే చాలు.. దరిద్రం పోయి అదృష్టం పట్టడం ఖాయం?

  Last Updated: 16 Dec 2023, 01:42 PM IST