Site icon HashtagU Telugu

Garuda Puranam: లక్ష్మీ కటాక్షం కావాలా? గరుడ పురాణంలో ఏం చెప్పారో తెలుసుకోండి

Garuda Purana For Laxmi

Garuda Purana For Laxmi

Garuda Puranam: లక్ష్మీ కటాక్షం ఉంటేనే మనకు డబ్బులు వస్తాయని కొంతమంది నమ్ముతారు. లక్ష్మీ కటాక్షం లేకపోతే డబ్బులు ఎక్కువ రోజులు ఉండవని, వెంటనే ఖర్చు అయిపోతూ ఉంటాయని అంటూ ఉంటాయి. అలాగే లక్ష్మీ కటాక్షం లేకపోతే డబ్బులు ఉండవని, అప్పుల పాలు అవుతామని నమ్ముతూ ఉంటారు. కొంతమంది తమ దగ్గర డబ్బులు అసలు నిలవడం లేదని, వచ్చినవి వచ్చినట్లు ఖర్చు అవుతున్నాయని బాధపడుతూ ఉంటారు. ఎంత సంపాదించినా సరే ఖాళీ అయిపోతున్నాయని సతమతమవుతూ ఉంటారు. వీటిని గరుణ పురాణంలో పరిష్కారాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

చాలామందికి డబ్బులు ఉన్నాయనే అహంకారం ఉంటుంది. అలాంటిది మంచిది కాదని చెబుతున్నారు. ఎప్పుడూ సంపద చూసుకుని గర్వపడకూదని, డబ్బులు ఉన్నాయని ఇతరులను అవమానించకూడం లేదా అగౌరపర్చడం చేయకూడదని చెబుతున్నారు. డబ్బులు ఉన్నాయని అహంకారంతో ఉండేవారిపై లక్ష్మీ కటాక్షం ఉండదు. అలాంటి వారి దగ్గర డబ్బులు ఎక్కుకకాలం ఉండవని పండితులు చెబుతున్నారు.

ఇక దానధర్మాలు చేస్తే పుణ్యం వస్తుందని, లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుందని పండితులు అంటున్నారు. అన్నదానం చేయయడం. అసరమైన వారికి సాయం చేయడం వల్ల పుణ్యం వస్తుందని, దీని వల్ల లక్ష్మీ కటాక్షం కూడా దొరుకుతుందని చెబుతున్నారు. దానధర్మాలు చేయమని గరుడ పురాణం కూడా చెబుతోంది. ఇక పితృదేవతలను ఆరాధించుకోవాలని గరుడ పురాణం చెబుతోంది. పొద్దునే లేచి స్నానం చేసిన తర్వాత పితృదేవతలు, దేవుళ్లను పూచిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చెబుతున్నారు.

ఇక ఆవుకు మేత వేయడం ద్వారా కూడా మంచి జరుగుతుందట. ఇంట్లో వండిన ఆహారాన్ని మొదట ఆవుకు పెట్టాలని, చివరి ముద్దను కుక్కకు పెట్టాలని గరుడ పురాణం చెబుతోంది. దీని వల్ల లక్ష్మీ కటాక్షంతో పాటు శని అనుగ్రహం లభిస్తుందని అంటున్నారు. ఇక చేయకూడదని పనులు కూడా పండితులు చెబుతున్నారు. సంధ్యా సమయంల ఇల్లు ఊడ్చటం, ఇల్లు శుభ్రం చేయకుండా టిఫిన్ చేయడం, ఇల్లు శుభ్రం చేయకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లడం మంచిది కాదని చెబుతున్నారు.