Vontimitta: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవ కార్యక్రమాల షెడ్యూల్ ఇదే

  • Written By:
  • Updated On - April 13, 2024 / 06:54 PM IST

Vontimitta: ఏప్రిల్ 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవ కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఏప్రిల్ 16న సాయంత్రం – అంకురార్ప‌ణ‌, 17వ తేదీన ఉదయం – ధ్వజారోహణం(మీథున లగ్నం) సాయంత్రం – శేష వాహన సేవ, 18న ఉదయం – వేణుగానాలంకారము, సాయంత్రం – హంస వాహన సేవ, 19న ఉదయం – వటపత్రశాయి అలంకారము, సాయంత్రం – సింహ వాహన సేవ, 20న ఉదయం – నవనీత కృష్ణాలంకారము, సాయంత్రం – హనుమత్సేవ, 21న ఉదయం – మోహినీ అలంకారము, సాయంత్రం – గరుడసేవ జరగనుంది.

22న ఉదయం – శివధనుర్భంగాలంకారము, సాయంత్రం – కళ్యాణోత్సవము(సా.6.30- రా.8.30)/ గజవాహనము, 23న ఉదయం – రథోత్సవం, 24న ఉదయం – కాళీయమర్ధనాలంకారము, సాయంత్రం – అశ్వవాహన సేవ, 25న ఉదయం – చక్రస్నానం, సాయంత్రం – ధ్వజావరోహణం, 26న సాయంత్రం – పుష్ప‌యాగంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.