చాలామంది వయసు పెరిగిపోతున్న పెళ్లి కాలేదు అని మదన పడుతూ ఉంటారు. పెళ్లి కాలేదు అని చెప్పి జాతకాలు పరిహారాలు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు. అయితే పెళ్లి కానీ అబ్బాయిలు గానీ అమ్మాయిలు కానీ ఎవరికైనా ఎంత ప్రయత్నించినా కూడా పెళ్లి జరగకపోతే తమిళనాడులో ఉన్న ఈ గుడిలకు వెళితే వెంటనే పెళ్లి జరుగుతుందట. మరి ఆ గుళ్ళు ఎక్కడ ఉన్నాయి? వాటి ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ముదిచూర్: ఈ ఆలయం చెన్నైలో ఉంది. ఈ ఆలయంలో విద్యంబిగై అమ్మవారు కొలువై ఉంటారు. ఈ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల పెళ్లి జరుగుతుంది అని భావిస్తూ ఉంటారు.
తిరువిడనత్తై: ఈ ఆలయం మహాబలిపురం దగ్గరలో ఉంది. ఈ ఆలయంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నారు. ఈ స్వామిని దర్శించుకోవడం వల్ల పెళ్లి జరుగుతుందని భావిస్తూ ఉంటారు.
తిరుమణంచేరి: ఈ ఆలయంలో శివుడు కొలువై ఉంటాడు. ఈ ఆలయంలో ఉన్న శివుడిని కళ్యాణ సుందరేశ్వర్ గా పిలుస్తారు. ఇక్కడే శివపార్వతుల వివాహం జరిగింది అని చెబుతూ ఉంటారు.
నాచ్చియార్ ఆలయం: ఈ ఆలయంలో శ్రీమహావిష్ణువు నరైయూరు నంబీగా, అమ్మవారినీ నాచ్చియార్ గా కొలుస్తారు. ఈ ఆలయంలో 108 వైష్ణవ క్షేత్రాలలో ఒకటిగా చెబుతారు.
తిరుకరుగావుర్: ఈ ఆలయంలో శివలింగం ఉంటుంది. ఇందులో ఉన్న శివలింగం పుట్టమన్నుతో తయారై ఉంటుంది. అక్కడ పెట్టమను కరిగిపోతుందేమో అన్న భయంతో అక్కడివారు స్వామివారికి అభిషేకాలు లాంటివి చేయరు.