Tirumala : తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని ప్రతి భక్తుడు అనుకుంటాడు. ఎప్పుడు కుదురుతుందా, ఎప్పుడు తిరుపతికి(Tirupati) వెల్దామా అని భక్తులు ఎదురుచూస్తుంటారు. ఏడుకొండలు ఎప్పుడూ గోవింద నామస్మరణతో లక్షలాది భక్తులతో మార్మోగుతూనే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఫ్యామిలీలు అయితే హాలిడేస్ వస్తే ఫ్యామిలీలతో కలిసి మరీ వెంకన్నని దర్శించాలనుకుంటారు.
టీటీడీ(TTD) వచ్చే భక్తుల కోసం అనేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తూనే ఉంటుంది. అయితే దర్శనం మాత్రం సామాన్య భక్తులకు దూరం నుంచి కొన్ని క్షణాలే ఉంటుంది. ఆ క్షణాలే అదృష్టంగా భావిస్తారు భక్తులు. కానీ విఐపి భక్తులు మాత్రం కొంచెం దగ్గరగా కొంచెం ఎక్కువ సేపు స్వామివారిని దర్శించుకుంటారు. దీంతో సామాన్య భక్తులు ఒక్కసారైనా విఐపి దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు.
దీనిపై టీటీడీ ఈవో స్పందించారు. ఇటీవల జరిగిన డయల్ యువర్ ఈవో ప్రోగ్రాంలో ఈవో ఏవి ధర్మారెడ్డి పాల్గొనగా భక్తులు ఇచ్చిన సూచనలు, సలహాలు, కంప్లైంట్స్ తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో ఉన్న పలు సమస్యలను భక్తులు మా దృష్టికి తీసుకువచ్చారు. వాటిని త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే ఇన్నాళ్లు ఆర్జిత సేవలను లక్కీ డిప్ ద్వారా అందించాం. పలువురు భక్తులు విఐపి దర్శనం కూడా కొంతమందికైనా లక్కీ డిప్ ద్వారా అందించాలని కోరారు. దీనిపై టీటీడీ మెంబర్స్ తో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీంతో దీనిపై పాజిటివ్ గా నిర్ణయం తీసుకుంటే ఇకపై సామాన్య భక్తులకు కొంతమందికైనా వేంకటేశ్వరస్వామి వారి దివ్య దర్శనం విఐపి దర్శనం చేసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు.
Also Read : TTD: కల్పవృక్ష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం, మాడ వీధుల్లో వాహనసేవ!