రేపటితో శ్రావణ మాసం ముగియనుంది. తర్వాత భాద్రపద మాసం మొదలు కానుంది. ఇక ఈ భద్రపద మాసంలో హిందువులు జరుపుకునే అతిపెద్ద ముఖ్యమైన పండుగ వినాయక చవితి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఈ పండుగ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. జ్ఞానకు అధిపతి అయిన ఆ విఘ్నేశ్వరున్ని పుట్టినరోజును దేశంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి ఒక్క ప్రదేశంలో జరుపుకుంటూ ఉంటారు. అయితే వినాయకుడిని పూజించే సముయంలో కొన్ని పనులు చేయడం మరచిపోతే కోపం వస్తుందట. పూజ ఫలం కూడా లభించదట. మరోవైపు గణేశుడి వాహనం ఎలుక ఇంద్రియాలకు చిహ్నం. హిందూ మతంలో ప్రధాన దేవతలలో ఒకడు గణపతి.
అయితే వినాయకుడిని పూజించేటప్పుడు తెలిసి తెలియక కూడా కొన్ని తప్పులు చేయవద్దు. ఈ పొరపాట్లు చేస్తే వినాయకుడికి ఆగ్రహం వస్తుందట. ఈ వినాయక చవితి రోజు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అన్న విషయానికి వస్తే.. పొరపాటున కూడా వినాయక చవితి రోజు వినాయకుడి పూజలో తులసి ఆకులను ఉపయోగించకూడదు. అలా ఉపయోగిస్తే ఆయన ఆగ్రహానికి లోనవ్వక తప్పదు. అలాగే విఘ్నేశ్వరుడికి చంద్రుడికి మధ్య సఖ్యత లేదు కాబట్టి, పొరపాటున కూడా వినాయక చవితి రోజు ఆ చంద్రుడిని అస్సలు చూడకూడదు. ఒకవేళ అలా చూస్తే నీలాప నిందలకు గురవడంతో పాటు లేనిపోని సమస్యలకు చేయని తప్పులకు కూడా మాటలు పడాల్సి వస్తుందట. కేవలం వినాయక చవితి రోజు మాత్రమే కాకుండా మామూలు సమయాలలో వినాయకుడికి పూజ చేసేటప్పుడు వెండి పాత్రలు తెల్లటి వస్తువులు వినియోగించకూడదట.
తెల్ల గంధానికి బదులుగా పసుపు చందనం, పసుపు వస్త్రం, తెల్లని వస్త్రానికి బదులుగా పసుపు పూసిన దారం ఉపయోగించాలట. అలాగే వినాయకుడి పూజలో పొరపాటున కూడా విరిగిన బియ్యాన్ని సమర్పించకూడదట. అందుకే అక్షింతలు ఉపయోగించే సమయంలో బియ్యం ముక్కలుగా ఉండకూడదట. అలాగే వినాయకుడి పూజలో ఎప్పుడు కూడా మొగలి పువ్వులు ఉపయోగించకూడదు. ఎప్పుడు కూడా విగ్నేశ్వరుడికి పొరపాటున కూడా ఎండిన వాడిన పూలను అస్సలు సమర్పించకూడదట. ఒకవేళ తాజా పువ్వులు లేకపోతే అస్సలు పూలు సమర్పించక పోయినా పర్లేదు కానీ ఎండిపోయిన వాడిపోయిన పువ్వులు మాత్రం సమర్పించకూడదని పండితులు చెబుతున్నారు. పువ్వులు లేని సమయంలో పువ్వులకు బాధలుగా దర్భను లేదా అక్షంతలను ఉపయోగించడం మంచిదట.
note: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది.