Vinayaka Chavithi Foods: విఘ్నేశ్వరునికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటో మీకు తెలుసా?

త్వరలో వినాయక చవితి రాబోతున్న విషయం తెలిసిందే. అయితే కొందరు ఇంట్లో మట్టి బొమ్మను పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. ఇంకొందరు బయట వీధులa

  • Written By:
  • Publish Date - September 7, 2023 / 09:25 PM IST

త్వరలో వినాయక చవితి రాబోతున్న విషయం తెలిసిందే. అయితే కొందరు ఇంట్లో మట్టి బొమ్మను పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. ఇంకొందరు బయట వీధులలో పెట్టే విగ్రహానికి పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఇంట్లో మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది స్వామి వారికి ఇష్టమైన నైవేద్యాలు అన్నీ కూడా వండి పెడుతూ ఉంటారు. అయితే చాలామందికి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు చేయాలని ఉంటుంది కానీ ఎటువంటి నైవేద్యాలు అంటే స్వామికి ఇష్టము అన్న విషయం తెలియదు. మరి విఘ్నేశ్వరుడికి నోరూరించే ఇష్టమైన నైవేద్యాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామూలుగా విగ్నేశ్వరుడికి లడ్డూలు, గుగ్గిల్లు పూజ సమయంలో నైవేద్యంగా సమర్పిస్తారు. గణేశుడు మోదకాలు లడ్డూలను ఇష్టపడతాడని చెబుతారు.

అందుకే పూజ సమయంలో చాలా ప్రాంతాలలో వీటిని అనేక రకాలుగా అందిస్తారు. గణపయ్యకు నైవేద్యం వండేటప్పుడు 3, 5, 7, 9 లెక్కల్లో వెరైటీలు చేయాలని చెబుతుంటారు. వినాయక చవితి వంటకాలు బొబ్బట్లు శెనగ పప్పు, బెల్లం లేదా చక్కెర, గోధుమ పిండితో చేసే ఈ వంటకం చాలా ప్రసిద్ధి చెందినవి. నెయ్యి వేసుకుని తినే ఈ వంటకాన్ని గణేష్ చతుర్థికి చాలా మంది తప్పనిసరిగా చేస్తుంటారు. పాల తాళికలు వంటకం పాల తాళికలు అనేది చేతితో తయారు చేసిన బియ్యం నూడుల్స్, పాలు, బెల్లం నెయ్యితో తయారు చేయబడిన తెలుగు రాష్ట్రాల్లో ఒక సాంప్రదాయ తీపి వంటకం.

రవ్వ మోదకం సెమోలినా, కొబ్బరి, బెల్లం యాలకుల పొడితో చేసిన రవ్వ మోదక్ వంటకం. సుజీ మోదక్ అని కూడా పిలుస్తారు. వీటిని చాలా సులభంగా తయారు చేస్తారు. అలాగే ఇవి లేనిదే వినాయక చవితి జరుపుకున్నట్లు అనిపించదు. మోదకాలు అంటే గణనాథుడికి చాలా ఇష్టం. ఈ మోదకాలను చాలా రకాలుగా తయారు చేస్తారు. నువ్వులు, బెల్లం, డ్రై ఫ్రూట్స్, చాకొలెట్స్ ఇలా చాలా రకాల పదార్థాలతో మోదకాలు తయారు చేయవచ్చు. లడ్డూలు వినాయక చవితి అనగానే మొదట గుర్తుకు వచ్చేవి మోదకాలు అయితే రెండవది లడ్డూలు. గణేశుడికి లడ్డులు అంటే చాలా ఇష్టం. చాలా ఇళ్లల్లో వివిధ రకాల లడ్డూలను తయారు చేసి స్వామికి తరువాత పిల్లలకు సమర్పిస్తారు. రవ్వ లడ్డు రవ్వ లడ్డు సెమోలినా, పంచదార, నెయ్యి, జీడిపప్పు ఎండుద్రాక్షలతో తయారు చేసే స్వీట్.

Vinayaka Chavithi

బెసన్ లడ్డూ.. ఈ రెసిపీ నోటిలో కరిగిపోయే ఆకృతితో ఉంటుంది. ఈ లడ్డూ చూడటానికి సాఫ్ట్ గా ఉంటుంది. డ్రై ఫ్రూట్ లడ్డు ని రుచికరమైన, ఆరోగ్యకరమైన లడ్డుగా చెప్పవచ్చు.ఈ డ్రై ఫ్రూట్ లడ్డులు చాలా బాగుంటాయి. పిల్లలు ఇష్టంగా తింటారు. సేమియా పాయసం సేమియాతో చేసే పాయసం అంటే చాలా మంది నోళ్లలో నీళ్లు ఊరడం ఖాయం. వెర్మిసెల్లితో పాలు, పంచదార, కిస్మిస్, బాదం, జీడిపప్పు వేసి ఈ మధురమైన సేమియా పాయసాన్ని తయారు చేసి ఆ గణపయ్యకు నైవేద్యంగా పెట్టవచ్చు. ఇవి మాత్రమే కాకుండా వడ / గారెలు, మినప పునుగులు, మైసూర్ బోండా, పునుగులు,సబుదన వడ, ఆలూ పకోడా, అరటిపండు బజ్జీ, మసాలా వడ, దాల్ వడ లాంటి నైవేద్యాలు విగ్నేశ్వరుడికి ఎంతో ఇష్టం ప్రీతికరం.