Site icon HashtagU Telugu

Vinayaka Chavithi : వినాయక చవితి వేళ.. వర్జ్యం, దుర్ముహూర్తం టైమింగ్స్ ఇవే

Vinayaka Chaturthi June 2021 1200x768

Vinayaka Chaturthi June 2021 1200x768

Vinayaka Chavithi : విఘ్నాలు తొలగించే వినాయకుడికి జై..  భక్తులపై కరుణ ప్రసరించే వినాయకుడికి జై.. ఈ సృష్టి యావత్తూ అనేకమైన గణాలతో కూడిన మహాగణం. గణాలకు అధిపతి కాబట్టే గణాధిపతి అనే పేరు వినాయకుడికి వచ్చింది. సృష్టిలోని గణాలలో అంతర్యామిగా ఉండే మహా దేవుడు గణేశుడు. ఇవాళ వినాయక చవితి వేళ ఏ టైంలో గణనాథుడికి పూజ చేయాలి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..  ఈరోజు ఉదయం 10:15 నిమిషాల నుంచి మరుసటి రోజు ఉదయం 10:43 నిమిషాల వరకూ వినాయక చవితి పూజలు, వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపనలు చేయొచ్చు. ఇవాళ వాడవాడలా వినాయకుడు కొలువుతీరి పూజలందుకునేసరికి మధ్యాహ్నం సమయం అవుతుంది. రేపు మాత్రం ఉదయం 11 గంట్లలోపే పూజలు పూర్తి చేసుకోవాలి. అందుకే చవితి సమయం ఎక్కువ ఉన్నందున ఈరోజే వినాయక చవితి పండుగను సెలబ్రేట్  చేసుకుంటున్నాం.

Also read : Nipah Virus: బిగ్ రిలీఫ్.. నిఫా వైర‌స్‌పై కేరళ ప్రభుత్వం

వర్జ్యం, దుర్ముహూర్తం 

సూర్యోదయానికి ఉన్న తిథినే లెక్కలోకి తీసుకుంటామని అనుకునే వారు మంగళవారం ఉదయం 11 గంటల లోపు పూజ చేసుకోవచ్చు. వర్జ్యం, దుర్ముహూర్తం ఉన్న సమయాల్లో పూజను ప్రారంభించకూడదు. ఇక ఈరోజు దుర్ముహూర్తం అనేది మధ్యాహ్నం 12 .25   నుంచి 1.09 వరకూ, మధ్యాహ్నం 2.46 నుంచి 3.35 వరకు ఉంది. ఇవాళ వర్జ్యం సాయంత్రం 4.56 నుంచి 6.36 వరకూ ఉంది. మీరు పూజ ప్రారంభించిన తర్వాత వర్జ్యం, దుర్ముహూర్తం వచ్చినా పర్వాలేదు. పూజను (Vinayaka Chavithi) ప్రారంభించిన టైమే లెక్కలోకి తీసుకోవాలి.

గమనిక: ‘ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.