హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి కూడా ఒకటి. ఈ పండుగను చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. వినాయక చవితి రోజు ఇళ్లలో అలాగే వీధుల్లో పెద్ద పెద్ద మండపాలు వేసి భారీ గణనాథుల విగ్రహాలను తెచ్చి పూజలు చేస్తూ ఉంటారు. అయితే వినాయక పూజలు దర్భ ను తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉంటారు. దీనినే చాలామంది గడ్డి అని కూడా పిలుస్తూ ఉంటారు. వినాయక పూజలో దీనిని తప్పనిసరిగా వినియోగిస్తూ ఉంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం గణేశుని ఆరాధనలో దర్భ గడ్డికి చాలా ప్రాముఖ్యత ఉంది.
దర్భలు లేని గణేశుని ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. దర్భలను నైవేద్యంగా సమర్పించడం వలన జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసం. అయితే వినాయక చవితి పూజలో దర్భలను ఎందుకు సమర్పిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి సెప్టెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 3:01 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు 7వ తేదీ సాయంత్రం 5:37 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం వినాయక చవితి సెప్టెంబర్ 7 శనివారం రోజున జరుపుకుంటారు. ఈ రోజున వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి ఉపవాస దీక్షలు చేస్తారు. కాగా విగ్నేశ్వరుడికి దర్భలను సమర్పించడం వల్ల అన్ని రకాల ఆటంకాలు తొలగిపోయి కార్యాలు సిద్ధిస్తాయని నమ్మకం.
అలాగే దర్భ గడ్డి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దర్భలను సమర్పించడం వెనుక ఉన్న మత విశ్వాసం ఏమిటంటే పూజా కార్యక్రమాలు పవిత్రంగా చేస్తారు. అలాగే వినాయకుడికి దర్భలను సమర్పించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయి. గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి, అనుగ్రహాన్ని పొందేందుకు దర్భ ఒక సులభమైన మార్గం అని నమ్ముతారు. దర్భ అనేది గణేశుడి పట్ల గౌరవం, ప్రేమకు చిహ్నం. ఇది గణేశుని పట్ల భక్తిని చూపుతుంది. కాబట్టి గణపతి పూజలో దర్భ ఖచ్చితంగా సమర్పిస్తారు. కాగా పూజలో దర్భ లను ఉపయోగించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. ఏదైనా శుభ కార్యం చేసే ముందు ఇంటి ప్రధాన ద్వారం వద్ద దర్భలను పెడితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంటి చుట్టూ దర్భలను పెట్టడం వలన ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుందని నమ్ముతారు. దీనికి వెనుక ఒక కథనం కూడా ఉంది. అయితే వినాయక పూజలో దర్భ లను సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం కలగడంతో పాటు ఒకవేళ మనపై ఆయన కోపంగా ఉండే శాంతిస్తాడని నమ్ముతారు.