ఈ ఏడాది 20204 సెప్టెంబర్ 7వ తేదీ శనివారం రోజు వినాయక చవితి పండుగను జరుపుకోనున్నారు. భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి సెప్టెంబర్ 6 మధ్యాహ్నం 3:01 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 5:37 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం, ఈ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు సెప్టెంబర్ 7 శనివారం నుండి ప్రారంభమవుతాయి. ఈ రోజున వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి ఉపవాస దీక్షలు చేస్తారు. అయితే ఈ రోజున కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే తప్పకుండా కష్టాలు తొలగిపోయి విజయం లభిస్తుందని చెబుతున్నారు. మరి వినాయక చవితి రోజున ఎలాంటి పరిహారాలు పాటించాలి అన్న విషయానికి వస్తే..
ఈ రోజున వినాయకుడిని పూజించాలి. వినాయక చవితి రోజున నియమ నిష్టలతో పూజించడం వల్ల సమస్త సమస్యలు తీరుతాయి. గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించి మోదకాలు, లడ్డూలు, తాజా పుష్పాలను సమర్పించాలి. గణేశుడిని సంపద శ్రేయస్సుకు దేవుడిగా కూడా భావిస్తారు. అందుకే ఈ రోజున ఆయనను పూజించడం వల్ల ఇంట్లో ఆనందం సంతోషంతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందట. అలాగే వినాయక చవితి రోజు ” ఓం గం గణపతయే నమః “లేదా “ఓం విఘ్నేశ్వర నమః” అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాలను జపించడం వల్ల గణేష్ ని అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతున్నారు. అదేవిధంగా గణేష్ చతుర్థి రోజున తప్పకుండా గణేష్ చాలీసా పఠించాలి. ఈ రోజున గణేష్ చాలీసా పఠించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం ద్వారా అన్ని రకాల ఇబ్బందులు, పనుల్లో ఏర్పడుతున్న అడ్డంకులు తొలగిపోతాయట.
అలాగే గణేశుడికి ఇంట్లో తయారు చేసిన మోదకం సమర్పించాలి. కుడుములు, ఉండ్రాళ్ళు వినాయకునికి ఇష్టమైన నైవేద్యంగా పరిగణించబడుతున్నాయి. కాబట్టి వీటిని నైవేద్యంగా సమర్పించడం వలన వినాయకుని అనుగ్రహం లభిస్తుందట. వినాయక చవితి రోజున పేదలకు అవసరం ఉన్న వాటిని ఆహారాన్ని బట్టలను సహాయం చేయడం వల్ల ఆయన ప్రత్యేక అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు.