విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయంలో(Vijayawada Kanakadurga Temple) పవిత్రోత్సవాల సమాచారాన్ని తాజాగా ప్రకటించారు దేవస్థానం అధికారులు. ఈ నెల ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 1 తేదీ వరకు మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు జరగనున్నాయి.
పవిత్రోత్సవాల సందర్భంగా ఈ నెల 30వ తేదీన తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి సుప్రభాతం, స్నపనాభిషేకం చేసి మొదలుపెడతారు. తొలి రోజు ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు. సెప్టెంబరు 1వ తేదీన ఉదయం 10.30 నిముషాలకు పూర్ణాహుతి కార్యక్రమంతో ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
కనకదుర్గ ఆలయంలో పవిత్రోత్సవాల సందర్భంగా ఈ నెల 30 నుంచి సెప్టెంబరు ఒకటో తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. అమ్మవారి నిత్య కైంకర్యాలు మాత్రం యధావిధిగా జరుగుతాయి. పవిత్రోత్సవాల సందర్భంగా దేవస్థానంలో ఏర్పాట్లు, వచ్చే భక్తులకు కావాల్సిన ఏర్పాట్లపై సమీక్షించి త్వరలో పనులు మొదలుపెట్టనున్నారు.
Also Read : TTD Meeting : టీటీడీ పాలకమండలి.. వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన చివరి సమావేశం.. తీసుకున్న నిర్ణయాలు ఇవే..