Kanaka Durga Temple Income : విజయవాడ కనకదుర్గమ్మ ఆదాయం ఎంతొచ్చిందో తెలుసా? గత 22 రోజులకు..

నేడు విజయవాడ(Vijayavada) ఇంద్రకీలాద్రిపై(Indrakeeladri) దుర్గమ్మ(Kanaka Durga) హుండీల(Hundi) లెక్కింపు జరిగింది. 22 రోజులకు గాను ఈ హుండీలను లెక్కించారు.

  • Written By:
  • Publish Date - September 26, 2023 / 09:00 PM IST

తాజాగా నేడు విజయవాడ(Vijayavada) ఇంద్రకీలాద్రిపై(Indrakeeladri) దుర్గమ్మ(Kanaka Durga) హుండీల(Hundi) లెక్కింపు జరిగింది. 22 రోజులకు గాను ఈ హుండీలను లెక్కించారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న అన్ని హుండీలను లెక్కించగా 2,92,28,842/- రూపాయల ఆదాయం(Income) వచ్చింది. సగటున ఒక రోజుకు రూ.13.28 లక్షల ఆదాయం వచ్చింది. ఇవి కేవలం మన కరెన్సీ రూపంలో వచ్చిన ఆదాయం. ఇదే కాకుండా బంగారం(Gold), వెండి(Silver), విదేశీ కరెన్సీ(Forign Currency), ఆన్లైన్ రూపంలో మరింత ఆదాయం వచ్చింది.

దుర్గమ్మకు కానుకల రూపంలో బంగారం 740 గ్రాములు, వెండి: 6 కేజీల 950 గ్రాములు వచ్చింది. అలాగే విదేశీ కరెన్సీ కూడా భారీగా వచ్చింది.

USA కరెన్సీ – 1822 డాలర్లు,
హాంకాంగ్ కరెన్సీ – 110 డాలర్లు,
కెనడా కరెన్సీ – 75 డాలర్లు,
ఆస్ట్రేలియా కరెన్సీ – 70 డాలర్లు,
యూరప్ కరెన్సీ – 25 యూరోలు,
సింగపూర్ కరెన్సీ – 4 డాలర్లు,
ఇంగ్లాండ్ కరెన్సీ – 5 పౌండ్లు,
మలేషియా కరెన్సీ – 2 రింగెట్లు,
ఒమాన్ కరెన్సీ – 100 బైసా,
ఖతార్ కరెన్సీ – 16 దిర్హమ్స్,
UAE కరెన్సీ – 275 దిర్హమ్స్,
కువైట్ కరెన్సీ – 200.5 దినార్లు,
ఇరాక్ కరెన్సీ – 20,000 దినార్లు వచ్చాయి.

అంతేకాక ఆన్లైన్ లో e – హుండీ ద్వారా రూ. 89,193/-లు విరాళం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చాయి. ఈవో ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ఈ హుండీలను లెక్కించారు. త్వరలో దసరా వస్తుండటంతో దసరా శరన్నవరాత్రి వేడుకలకు కావాల్సిన ఏర్పాట్లను మొదలుపెట్టనున్నట్టు తెలిపారు ఆలయ అధికారులు.

 

Also Read : MMTS Special Trains : హైదరాబాద్లో నిమజ్జనం నాడు రాత్రంతా ఎంఎంటీఎస్ సర్వీస్ లు..