Site icon HashtagU Telugu

Zodiac Sign: 2024లో ఆ మూడు రాశుల వారికి తిరుగు ఉండదు.. రాజయోగం?

Mixcollage 07 Dec 2023 01 52 Pm 3392

Mixcollage 07 Dec 2023 01 52 Pm 3392

శుక్రుడి సంచారం కొన్ని రాశులవారికి కలిసివస్తుంది. కాగా శుక్రుడు త్వరలోనే రాశి సంచారం చేయబోతోంది. ఆర్థిక ప్రయోజనాలు లభించాలి అంటే జాతకంలో శుక్రుడు బలంగా ఉండాల్సిందే. డిసెంబర్ 25 ఉదయం 6:33 గంటలకు శుక్రుడు వృశ్చికరాశి లోకి సంచారం చేయబోతున్నాడు. జనవరి 18 వరకు అక్కడే ఉంటాడు. 2024 జనవరి 18న ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్ర గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అందులో భాగంగానే 2024లో మూడు రాశుల వారికి రాజయోగం పట్టనుంది. మరి ఆ మూడు రాశుల్లో మీ రాశి కూడా కూడా ఉందేమో చెక్ చేసుకోండి..

తులారాశి… ఈ రాశిలో ప్రేమ పెళ్లి కోసం ఎదురుచూస్తున్న ఒంటరి వ్యక్తులకు శుభవార్త లభిస్తుంది. ఉద్యోగస్తులకు అలాగే వ్యాపారస్తులకు అదృష్టం కలిసి వస్తుంది. వివాహితులు తమ భాగస్వామి ఆరోగ్యంపై దృష్టిసారించాలి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే ప్రతి పనిలోను విజయం సాధిస్తారు.

మేషరాశి… ఈ రాశిలో ఉద్యోగం చేస్తున్నవారు వచ్చే ఏడాది సరికొత్త అవకాశాలను పొందుతారు. ఆ సమయంలో ఎంత బాగా కష్టపడితే అంత మంచి ఫలితం లభిస్తుంది. కుటుంబంలో శాంతి, సంతోషంతో నిండిన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఇద్దరిమధ్య చిన్న చిన్న మనస్పర్థలు ఉంటే ఓపికగా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవడం ఉత్తమమని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ రోజు వారికి ఆర్థికంగా కూడా లాభం చేకూరుతుంది.

కర్కాటక రాశి.. ఈ రాశి విషయానికి వస్తే.. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలను ఆర్జిస్తారు. భూములు లేదంటే వాహనాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది.