Site icon HashtagU Telugu

Shukra Gochar 2023 : 2023లో ఈ 5 రాశులవారిపై శుక్రుడి అనుగ్రహం

Shukra Gochar 2023

Shukra Gochar 2023

నూతన సంవత్సరంలో (New Year) అడుగుపెట్టే ముందు 90 శాతం మంది కామన్ గా కోరుకునే కోరిక.. ఆర్థికంగా ఓ అడుగు ముందుకు పడాలనే. కానీ అది నెరవేరాలంటే కష్టపడాలి, అదృష్టం కలసిరావాలి.. వీటికి తోడు గ్రహబలం కూడా ఉండాలి. కొన్నిసార్లు తక్కువ కష్టపడినా ఎక్కువ ఫలితాలు పొందుతారు కొందరు..అది గ్రహాల అనుగ్రహం వల్లే అంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ముఖ్యంగా ఆర్థికంగా బలపడాలంటే శుక్రుడి అనుగ్రహం ఉండాలని చెబుతారు. మరి 2023లో శుక్రుడి (Shukra) అనుగ్రహం ఏ ఏ రాశుల పై ఉంటుందో ఎలాంటి ఉపశమనం పొందుతారో చూద్దాం..

మేష రాశి (Aries):

2023లో మేష రాశి వారికి ఇంటి ఖర్చులు భారీగా ఉంటాయి కానీ వాటికి తగిన ఆదాయం కూడా అలాగే వస్తుంది. పాత సంవత్సరంతో పోలిస్తే కొత్త ఏడాది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఏడాది ఆరంభంలో కన్నా గడిచే కొద్దీ పరిస్థితి మరింత మెరుగుపడుతూ ఉంటుంది. సంపాదించడంతో పాటూ అప్పులు తీర్చగలుగుతారు, ఇబ్బందులను అధిగమిస్తారు. కేవలం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే.. ఖర్చులకు ఎంత అవసరమో చూసుకుని పెట్టడమే.

వృషభ రాశి (Taurus):

సంపదకు అధిపతి అయిన శుక్రుడి (Shukra) ప్రభావం ఈ రాశివారిపై పుష్కలంగా ఉంది. వీరికి 2023లో వివిధ మార్గాల్లో ధనం చేతికందుతుంది. ఆర్థికంగా ఎదిగేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మీ శ్రమకు మించిన ఫలితాలు పొందుతారు. భూమి, ఇల్లు, ఆభరణాలు, వాహనం కొనుగోలుకు అత్యంత అనుకూల సమయం.

సింహ రాశి (Leo):

శుక్రుడి శుభసంచారం ఈ రాశివారికి బాగా కలిసొస్తుంది. ఉద్యోగులకు శుభసమయం…వీరి కెరీర్ అకాస్మాత్తుగా పైకి ఎదుగుతుంది. ఏదైనా ఆర్థిక లక్ష్యాన్ని సాధించాలని నిశ్చయించుకున్నట్టైతే..2023లో తప్పకుండా సాధించగలుగుతారు. మీ గౌరవం పెరుగుతుంది. మీరు కోరుకున్న జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఈ ఏడాది మంచి సమయం

తులా రాశి (Libra):

తులా రాశి వారికి ఈ ఏడాది ఆర్థికపరంగా అనుకూల ఫలితాలున్నాయి. కష్టపడి పనిచేస్తారు..అందుకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఏడాది మొత్తం మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది.మీ వ్యక్తిగత జీవితంలో ఏవో కష్టాలున్నాయని బాధపడడం మానేయండి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నవారు, నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకున్నవారికి 2023 శుభసమయం.

మకర రాశి (Capricorn):

మకర రాశివారికి  2023లో శుభప్రదమైన సంవత్సరం. ఈ ఏడాది శుక్రుడి శుభసంచారం కారణంగా  ఈ రాశివారు ఆర్థిక స్థిరత్వం సాధించగలుగుతారు. అదనపు ఆదాయం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీకు మీరు గీసుకున్న గీతనుంచి బయటపడి కొన్ని విషయాల్లో రిస్క్ చేయగలిగితే మంచి లాభాలు పొందుతారు. ఈ రాశి వ్యాపారులకు శుభసమయం. నూతన పెట్టుబడులు పెట్టొచ్చు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించి ముందడుగు వేస్తే మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు.

Also Read:  Lord Vishnu : విష్ణువు కూర్మావతారంలో ఉన్న ఏకైక ఆలయం ఇది..