Vasthu Tips: ఈ వస్తువులను బహుమతిగా ఇవ్వకూడదు.. ఇచ్చారంటే అంతే సంగతులు?

సాధారణంగా మనం ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు గృహప్రవేశం పుట్టినరోజులు పెళ్లి కానుకలు ఇలా సందర్భాన్ని బట్టి

  • Written By:
  • Publish Date - December 20, 2022 / 07:30 AM IST

సాధారణంగా మనం ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు గృహప్రవేశం పుట్టినరోజులు పెళ్లి కానుకలు ఇలా సందర్భాన్ని బట్టి వివిధ రకాల గిఫ్ట్లు ఇచ్చి ఆ వ్యక్తిపై మనకున్న ప్రేమను తెలియజేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క గిఫ్ట్ లను ఇస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల వస్తువులను బహుమతిగా అసలు ఇవ్వకూడదు. మరి ఎటువంటి వస్తువులు బహుమతిగా ఇవ్వకూడదు ఇస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎప్పుడు కర్చీఫ్ లు, టవల్ లు ఎవరికి బహుమతిగా ఇవ్వకూడదు. ఇలాంటివి గిఫ్ట్ గా ఇవ్వడం వల్ల వారి జీవితం నిరాశతో నిండుతుంది.

అలాగే చాలామంది గృహ అలంకరణ వస్తువులను బహుమతిగా ఇస్తూ ఉంటారు. అనగా మొక్కలు అక్వేరియం లాంటివి బహుమతులుగా ఇస్తూ ఉంటారు. నీరు ఉన్న వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి. చాలామంది విగ్రహాలను బహుమతులుగా ఇస్తూ ఉంటారు. ఇవ్వడం మంచిదే కానీ ఆ విగ్రహాలకు సక్రమంగా పూజలు చేయకపోతే వాటిని ఇచ్చిన వారికి తీసుకున్న వారికి కూడా సమస్యలు వస్తాయి. అలాగే ఎప్పుడూ కూడా పెన్ను,నోట్ బుక్ లాంటి స్టేషనరీ వస్తువులను గిఫ్టులుగా ఇవ్వకూడదు. స్టేషనరీ వస్తువులు ఇవ్వడం వల్ల వాటిని తీసుకున్న వారు ఎదగడానికి బదులుగా మరింత నష్టపోతారు.

అలాగే పదునైన వస్తువులు అనగా కత్తి, స్పూన్ లాంటివి వంట గదిలో ఉపయోగించే వస్తువులను గిఫ్ట్ లుగా ఇవ్వడం వల్ల వారి మధ్య ఉన్న సంబంధం దెబ్బతీస్తుంది. అలాగే అబ్బాయిలు ఎక్కువగా వారి గర్ల్ ఫ్రెండ్స్ కి బ్యాగులను బహుమతులుగా ఇస్తూ ఉంటారు. అబ్బాయిలకి కూడా పర్సులు ఇస్తూ ఉంటారు. ఇలా చేయడం అంటే మీ ఆర్థిక పరిస్థితిని వారికి ఇచ్చినట్లే అని చెప్పవచ్చు. చాలామంది బొకేలు ఇస్తూ ఉంటారు. అందులో ఉండే పువ్వులు తాజాగా ఉంటే మంచిదే కానీ ఎండిన పువ్వులు ఉంటే జీవితంలో నష్టం నొప్పికి చిహ్నం. కాబట్టి ఎప్పుడూ ఎండిన పువ్వులు ఇవ్వకూడదు.