Site icon HashtagU Telugu

‎Main Door: ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ విగ్రహం ఉంచితే చాలు.. కలిగే ఫలితాలు అస్సలు నమ్మలేరు!

Main Door

Main Door

Main Door: మామూలుగా మనం ఇంటి సింహద్వారం అనగా ప్రధాన ద్వారం వద్ద అనేక రకాల విగ్రహాలు పెడుతూ ఉంటాం. అలాగే అనేక రకాల మొక్కలు కూడా పెంచుకుంటూ ఉంటాం. అయితే వాస్తు ప్రకారం ఇప్పుడు చెప్పబోయే విగ్రహాన్ని పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది అని చెబుతున్నారు. ఇంతకీ ఎలాంటి విగ్రహాన్ని సింహద్వారం వద్ద ఉంచాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

‎సూర్యనారాయణ మూర్తి విగ్రహాన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెట్టడం వల్ల అంతా మంచే జరుగుతుంది అని చెబుతున్నారు. ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లో ధనం పెరగడంతో పాటు ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉండవచ్చు అని చెబుతున్నారు. కాగా సూర్య భగవానుడు గ్రహాలకు అధిపతి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా సానుకూల శక్తిని పెంచడానికి కూడా సూర్యుని విగ్రహం ఎంతో బాగా ఉపయోగపడుతుందట. ఎప్పుడు అయితే ఇంటి ప్రధాన ద్వారం వద్ద సూర్యనారాయణ మూర్తి విగ్రహాన్ని పడతారో అప్పటినుండి శని దుష్ప్రభావాల నుంచి బయటపడవచ్చట.

‎అలాగే గురుదోషం పితృ దోషం వంటిది కూడా తగ్గుతాయని చెబుతున్నారు. ఆరోగ్యం బాగుంటుందట. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని చెబుతున్నారు. దాంతో ఆనందంగా జీవించవచ్చట. అయితే అంతా బాగానే ఉంది కానీ వ్యాపారం చేసేవారు మాత్రం సూర్యుడి విగ్రహాన్ని అసలు పెట్టకూడదని చెబుతున్నారు. మరి ముఖ్యంగా పాత సామాన్లు నూనె ఇనుము వంటి వాటికి సంబంధించిన వ్యాపారాలు చేసేవారు సూర్యనారాయణ మూర్తి విగ్రహం పెట్టడం వల్ల నష్టాలు కలుగుతాయి అని చెబుతున్నారు. కాబట్టి వ్యాపారం చేసే వాళ్ళు పండితుల సలహా మేరకు సూర్యనారాయణ విగ్రహం పెట్టుకోవడం మంచిది..

Exit mobile version