Vasthu Tips: మామూలుగా ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇందుకోసం వాస్తు ప్రకారం ఎన్నెన్నో చిట్కాలను కూడా పాటిస్తూ ఉంటారు. అయితే కొందరు ఇంటి ప్రధాన ద్వారం వద్ద అనేక రకాల దేవుళ్ళ విగ్రహాలు ఫోటోలు పెట్టుకోవడంతో పాటుగా, కొన్ని రకాల మొక్కలను కూడా పెంచుకుంటూ ఉంటారు. వీటితో పాటు ఇప్పుడు చెప్పబోయే మూడు రకాల వస్తువులను మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెడితే చెడు దృష్టి వంటివి ఇంటి దరిదాపుల్లోకి కూడా రావని పండితులు చెబుతున్నారు. మరి ఎటువంటి వస్తువులను ఇంటి గుమ్మం వద్ద ఉంచాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొన్ని శుభ వస్తువులను ఉంచడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సానుకూలత పెరుగుతుందట. ప్రధాన ద్వారం వద్ద కొబ్బరికాయ లేదా శంఖాన్ని ఉంచడం శుభ ఫలితాలు కనిపిస్తాయట. ఇది లక్ష్మీదేవికి చిహ్నం అని ఇది ఇంట్లో శ్రేయస్సు స్వచ్ఛతను తెస్తుందని చెబుతున్నారు. ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి గుమ్మానికి వేలాడదీసి ప్రతిరోజూ ధూపం లేదా దీపం చూపించాలట. దీనితో పాటు, శంఖాన్ని ఎప్పటికప్పుడు గంగాజలంతో శుభ్రం చేయాలనీ, ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవని చెబుతున్నారు. హిందూ సంప్రదాయంలో స్వస్తిక్, ఓం చిహ్నం శుభం సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణిస్తారట.
వీటిని ఎరుపు లేదా పసుపు రంగు బట్టలో కట్టి ప్రధాన ద్వారం కుడి వైపున ఉంచాలని ఈ పరిహారం ఇంట్లో సుఖశాంతులు శుభ శక్తిని కాపాడుతుందని చెబుతున్నారు. దృష్టి దోషం నుంచి రక్షించడానికి నిమ్మ మిరప తోరణం ఇంటికి కట్టాలట. అది ఎండిపోతే శనివారం లేదా మంగళవారం మార్చడం మంచిదని చెబుతున్నారు. దీనిని తలుపు మధ్యలో వేలాడదీయాలట. నల్లటి వస్త్రాన్ని జోడించడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా వాస్తు ప్రకారం ఇంటి ద్వారం చుట్టూ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలట. పగిలిన లేదా తుప్పు పట్టిన వస్తువులను అక్కడ ఉంచకూడదని శుభ్రమైన ద్వారం సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా ప్రధాన ద్వారం వద్ద ప్రతిరోజూ దీపం వెలిగించడం చాలా శుభప్రదం అని ఇది ఆ ప్రదేశంలోని ప్రతికూల శక్తిని నాశనం చేయడమే కాకుండా, సానుకూల ప్రకంపనలను కూడా పెంచుతుందని, సాయంత్రం సమయంలో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో లక్ష్మిదేవి కొలువై ఉంటుందని పండితులు చెబుతున్నారు.
Vasthu Tips: ప్రధాన ద్వారం వద్ద ఈ 3 వస్తువులను ఉంచితే చాలు.. చెడు దృష్టి దరిదాపుల్లోకి కూడా రాదు!

Main Door Tips