Head Bath: వారంలో ఆ రోజు తలస్నానం చేస్తే చాలు.. దరిద్రం వదిలిపోవడం ఖాయం?

  • Written By:
  • Publish Date - March 11, 2024 / 03:56 PM IST

మామూలుగా మనం తరచూ స్నానం చేస్తూ ఉంటాం. అయితే కొందరు ప్రతిరోజు తలస్నానం చేస్తూ ఉంటారు. అయితే స్నానం చేయడం మంచిదే కానీ కొన్ని ఆరోగ్యకరమైన కారణాల దృష్ట్యా తలస్నానం, తలంటు స్నానం విషయంలో నియమ నిబంధనలు ఉన్నాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కొంతమంది ఎప్పుడు పడితే అప్పుడు తలంటు స్నానం చేస్తూ ఉంటారు. అది ఏమాత్రం మంచిది కాదట. తల స్నానానికి, తలంటు స్నానానికి మధ్య వ్యత్యాసం ఉందన్న విషయం ప్రతి ఒక్కరు ముందుగా గమనించాలి. తలస్నానం అంటే తల పైన నీళ్లు పోసుకుని చేసే స్నానం తల స్నానం. తలంటు స్నానం అంటే తలకు, ఒంటికి నూనె రాసుకుని, కుంకుడుకాయలతో కానీ షాంపుతో కానీ చేసే స్నానం తలంటు స్నానం.

దీనినే అభ్యంగన స్నానం అని కూడా పిలుస్తారు. ఆడవాళ్లు ప్రతిరోజు తల స్నానం చేయకూడదని శాస్త్రం చెబుతోంది. మగవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయవచ్చని సూచిస్తుంది. ఏ స్నానమైనా చెయ్యాల్సిన సమయం ఇదే అసలు తల స్నానం అయినా, తలంటు స్నానమైనా సూర్యోదయానికి ముందే చేస్తే చాలా మంచిదని చెబుతారు. పొద్దుపోయిన తర్వాత చేసిన, లేదా తిన్న తర్వాత చేసిన దాని ఫలితం ఉండబోదని, అనారోగ్యాలు కలుగుతాయని చెబుతున్నారు. అయితే వృద్ధులు అంత ఉదయాన్నే కాకుండా కాస్త ఎండ వచ్చిన తర్వాత చేసినా పర్వాలేదు. ఇక తలస్నానమైన, తలంటు స్నానమైనా ప్రతిరోజూ చేయడం మంచిది కాదు. కొన్ని రోజులలో తలంటు స్నానం చేయడం వల్ల ప్రతికూలమైన ఫలితాలు కూడా ఉంటాయి.

మగవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయవచ్చు కానీ ఆడవాళ్లు ప్రతిరోజు తలస్నానం చేయకూడదు. ఇక తలంటు స్నానం విషయానికి వస్తే… ప్రత్యేకమైన కొన్ని రోజులను కూడా సూచించడం జరిగింది తలంటు స్నానాన్ని వారానికి రెండుసార్లు చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. బుధ, శనివారాల్లో తలంటు స్నానం చేస్తే సత్ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. మిగతా రోజుల్లో తలంటు స్నానం చేస్తే ప్రతికూల ఫలితాలు కలుగుతాయట. ఇక ఆదివారం రోజు తలస్నానం కానీ తలంటు స్నానం కానీ చేస్తే అనుకూలం కాదు. దానివల్ల అనారోగ్యం కలుగుతుంది. సంతానానికి కీడు చేకూరుతుంది. అది చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇక సోమవారం నాడు తలస్నానం లేదా తలంటు స్నానం చేస్తే లేనిపోని ఆందోళనలు కలుగుతాయి. భయం వెంటాడుతుంది. శరీరం కాంతిని కోల్పోతుంది.

మంగళవారం నాడు తల స్నానం లేదా తలంటు స్నానం చేస్తే ఆయు క్షీణం కలుగుతుంది. భర్తకు పీడ కలుగుతుంది. విరోధం, అపాయం కలుగుతుంది. గురువారం రోజు తలస్నానం గాని తలంటు స్నానం కానీ చేస్తే ధన వ్యయం కలుగుతుంది. శత్రు బాధలు అధికమవుతాయి. అశాంతి కలుగుతుంది. చదువుకు కూడా ఆటంకం ఏర్పడుతుంది. శుక్రవారం తలస్నానం చేస్తే అశాంతి కలుగుతుంది. రోగాలు ఎక్కువవుతాయి. వస్తు నాశనం కలుగుతుంది. అందుకే ఈ రోజుల్లో తల స్నానం లేదా తలంటు స్నానం చెయ్యాలని అస్సలే ఎవరూ చెప్పరు. బుధవారం నాడు తలంటు స్నానం చేస్తే మాత్రం అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి కీర్తి, సంపద, ధన లాభం కలుగుతుంది. ఏ పని చేసినా కలిసి వస్తుంది. శనివారం నాడు తలస్నానం చేస్తే మంచి సత్ఫలితాలు కలుగుతాయి. ఆయుష్షు వృద్ధి చెందుతుంది. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. అన్ని విధాలుగా శనివారం నాడు తల స్నానం చేయడం లాభిస్తుంది. ఈ రెండు రోజుల్లో తలంటు స్నానం చేస్తే దరిద్ర దేవత మనల్ని విడిచి వెళ్తుంది. ఇక ఇవి కాకుండా పండుగ రోజులు, పర్వదినాలు, శుభకార్యాలు, పుట్టినరోజుల సమయంలో తల స్నానం లేదా తలంటు స్నానం చేయడానికి ఎటువంటి నిబంధనలు లేవు.