Site icon HashtagU Telugu

Hanuman Picture: హనుమంతుని ఫోటోని ఇంట్లో పెడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?

Mixcollage 22 Jun 2024 11 06 Am 7250

Mixcollage 22 Jun 2024 11 06 Am 7250

హిందువులు ఎక్కువగా కొలిచే దేవుళ్లలో ఆంజనేయస్వామి కూడా ఒకరు. ఆంజనేయ స్వామికీ మంగళవారం శనివారం రోజుల్లో భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. హనుమంతుని పూజించడం వల్ల రాముడి అనుగ్రహం కూడా కలుగుతుందని మనోధైర్యం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా హనుమంతుడు పట్ల భక్తి కలిగి ఉండేవారు సంపన్నువంతులు అవుతారని, సమస్యల నుండి త్వరగా బయటపడతారని అందరూ నమ్ముతారు. ఇకపోతే చాలా వరకు ఇంట్లో విగ్రహాలకు బదులు ఫోటోలను ఎక్కువగా పెట్టుకొని పూజిస్తూ ఉంటారు.

అయితే ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోవడం మంచిది కానీ ఎక్కడ, ఏ దిశలో ఉంచాలి అన్న విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మరి ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హనుమంతుడు చిత్రపఠాన్ని దక్షిణ దిశలో ఉంచాలి. కూర్చున్న భంగిమలో ఉన్న హనుమాన్ చిత్రం ఎరుపు రంగులో ఉండాలి. అటువంటి చిత్రాన్ని ఈ దశలో ఉంచడం వలన దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. అలాగే ఆంజనేయస్వామి బ్రహ్మచారి కాబట్టి ఆంజనేయస్వామి ఫోటోని ఎట్టి పరిస్థితులలో పడకగదిలో ఉంచకూడదు. ఇలా చేయటం వలన అశుభం జరుగుతుంది.

అలాగే మీ ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నాయి అనిపిస్తే ఇంటి ప్రధాన ద్వారం మీద పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రాన్ని ఉంచవచ్చు. కాగా ప్రతికూల శక్తులను రాకుండా చేస్తే ఇంట్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి పంచముఖ హనుమంతుని చిత్రం ఎంతో మంచిది. అలాగే హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎత్తడం, సంజీవని పర్వతంతో ఎగురుతున్నట్లు ఉండే చిత్రపఠాలని ఇంట్లో పెట్టుకోవడం వలన మనం ఏ కార్యమైనా చేయగలం అనే మనోధైర్యం వస్తుంది. ఇంట్లో నీటికి సంబంధించిన వాస్తు దోషంఉంటే అనేక సమస్యలు వస్తాయి. ఈ సమస్యని తొలగించడానికి పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రాన్ని దక్షిణం వైపు ఉండే విధంగా పెట్టుకోవాలి. ఇలా ఉంచటం వలన వాస్తు దోషం నుంచి తప్పించుకోవడమే కాకుండా రోగాల బారి నుంచి కూడా బయటపడవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య వియోగం కూడా తగ్గుతుంది. అలాగే ప్రతి పనిలో విజయం సాధించడానికి, పనులలో పురోగతి కోసం ఎగిరే భంగిమలో ఉన్న హనుమంతుని బొమ్మను ఉంచటం చాలా మంచిది.