Site icon HashtagU Telugu

Hanuman Photo: హనుమంతుని చిత్రపటాన్ని ఇంట్లో పెడుతున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోవాల్సిందే?

Mixcollage 02 Dec 2023 07 19 Pm 3990

Mixcollage 02 Dec 2023 07 19 Pm 3990

హిందువులు ఎక్కువగా కొలిచి దేవుళ్లలో ఆంజనేయ స్వామి కూడా ఒకరు. పల్లెటూర్లలో ప్రతి ఒక్క ఊరిలో కూడా ఆంజనేయ స్వామి విగ్రహం లేదంటే గుడి తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి మంగళవారం, శనివారం రోజున ఆంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అయితే మామూలుగా మన ఇండ్లలో హనుమంతుని ఫోటోని ఫోటోలు పెట్టుకుని పూజిస్తూ ఉంటారు. కొందరు ఇంట్లో పూజ గదిలో పెట్టుకొని పూజిస్తే మరి కొందరు గుమ్మానికి ఎదురుగా, ఇంటి బయట పెడుతూ ఉంటారు. నిజానికి ఆంజనేయ స్వామి ఫొటోని ఎక్కడ పెట్టాలి? హనుమంతుడి చిత్రపటాన్ని పెట్టినప్పుడు ఎటువంటి విషయాలు గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మామలుగా ఆంజనేయస్వామిని మనోధైర్యం కోసం, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉండడం కోసం పూజిస్తూ ఉంటారు. హనుమంతుడు పట్ల భక్తి కలిగి ఉండేవారు సంపన్నవంతులు అవుతారని, సమస్యల నుండి త్వరగా బయటపడతారని అందరూ నమ్ముతారు. అందుకే ఇంట్లో చాలామంది ఆంజనేయస్వామి చిత్రపఠాలు పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. హనుమంతుడు చిత్రపఠాన్ని దక్షిణ దిశలో ఉంచాలి. కూర్చున్న భంగిమలో ఉన్న హనుమాన్ చిత్రం ఎరుపు రంగులో ఉండాలి. అటువంటి చిత్రాన్ని ఈ దశలో ఉంచడం వలన దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు.

అలాగే ఆంజనేయస్వామి బ్రహ్మచారి కాబట్టి ఆంజనేయస్వామి పఠాన్ని పడకగదిలో ఉంచకూడదు. ఇలా చేయటం వలన అశుభం జరుగుతుంది. అదేవిదంగా మీ ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నాయనిపిస్తే ఇంటి ప్రధాన ముఖద్వారం మీద పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రాన్ని ఉంచవచ్చు. ప్రతికూల శక్తులను రాకుండా చేస్తే ఇంట్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి పంచముఖ హనుమంతుని చిత్రం ఎంతో మంచిదని వాస్తు శాస్త్రం నిపుణులు చెప్తున్నారు. అలాగే హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎత్తడం, సంజీవని పర్వతంతో ఎగురుతున్నట్లు ఉండే చిత్రపఠాలని ఇంట్లో పెట్టుకోవడం వలన మనం ఏ కార్యమైనా చేయగలం అనే మనోధైర్యం వస్తుందని చెప్తారు పెద్దలు.

అలాగే ఇంట్లో నీటికి సంబంధించిన వాస్తు దోషము ఉంటే అనేక సమస్యలు వస్తాయి. ఈ సమస్యని తొలగించడానికి పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రాన్ని దక్షిణం వైపు ఉండే విధంగా ఉంచడం మంచిది. ఇలా ఉంచటం వలన వాస్తు దోషం నుంచి తప్పించుకోవడం మాత్రమే కాకుండా రోగాల బారి నుంచి కూడా బయటపడవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య వియోగం కూడా తగ్గుతుంది. అలాగే ప్రతి పనిలో విజయం సాధించడానికి, పనులలో పురోగతి కోసం ఎగిరే భంగిమలో ఉన్న హనుమంతుని బొమ్మను ఉంచటం చాలా మంచిది. అలాగే జాతకంలో మంగళ దోషం ఉంటే దక్షిణ దిశలో హనుమంతుని చిత్రాన్ని ఉంచటం వలన ఆ దోషం పోతుంది. ఈ విధంగా హనుమంతుని ఫోటో నేను ఇంట్లో పెట్టేటప్పుడు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి.

Exit mobile version