Site icon HashtagU Telugu

Vastu Tips: ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ పారిపోవాలంటే ఈ విధంగా చేయాల్సిందే?

Mixcollage 05 Feb 2024 03 50 Pm 2196

Mixcollage 05 Feb 2024 03 50 Pm 2196

మామూలుగా చాలామంది ఇళ్లలో అన్నీ ఉన్నప్పటికీ మనశ్శాంతి ఉండదు. తరచూ ఇంట్లో గొడవలు జరగడం వల్ల ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, బాధపడుతూ ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే అటువంటి వారు మనశ్శాంతి కోసం, కుటుంబ శ్రేయస్సుకోసం కొన్ని వాస్తు చిట్కాలు పాటిస్తే మంచిదని చెబుతున్నారు. ఇంట్లో వాస్తు దోషాల వల్ల కలిగే ప్రతికూల ఫలితాలకు చిన్నచిన్న వాస్తు చిట్కాలను పాటిస్తే మంచిదని చెబుతున్నారు. అలా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడానికి ఇంట్లో ఉండే ప్రతికూల పరిస్థితులు నెగటివ్ ఎనర్జీనే కారణంగా చెప్పవచ్చు. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..

ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించటానికి ఈశాన్య మూలలో కలశాన్ని ప్రతిష్టించాలి. కలశాన్ని వినాయకుడి స్వరూపంగా భావించి పూజించాలి. కలశాన్ని ప్రతిష్టించి వినాయకుడిని పూజిస్తే ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అంతేకాదు ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నట్లుగా అనిపిస్తే, ప్రతికూల శక్తిని గ్రహించే గుణం ఉప్పుకు ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇల్లు తుడిచేటప్పుడు ఉప్పునీళ్లతో తుడవడం, ఉప్పును గది నాలుగు మూలలలో పోయడం వల్ల ప్రతికూలశక్తులు పోతాయి అని చెబుతున్నారు. ఇక నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవడానికి ఇంటి ప్రవేశద్వారం వద్ద పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రం ఉంచితే మంచిదని, పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రం ఇంట్లోకి ఎటువంటి ప్రతికూలతను రానివ్వదు.

ఇంటి ముందు పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రాన్ని పెట్టుకోవడం చాలా శుభప్రదమైన, ఫలవంతమైన పరిహారం అని చెబుతున్నారు. ఇక వాస్తు దోషం ఉంటే ఇంట్లో కర్పూరాన్ని నిత్యం వెలిగించడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ పోతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో గడియారాలను ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచాలని, అలా ఉంచితే కూడా ప్రతికూల ప్రభావాలు పోతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఇంటి ముందు తులసి మొక్కను పెట్టుకోవడం మంచిది. తూర్పు దేశంలో తులసి మొక్కను నాటడం వల్ల సానుకూల శక్తిని ఇంటికి తీసుకువస్తుంది. అలాగే ఇంట్లో సువాసనగల అగరబత్తీలు కాల్చటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు బయటకు వెళతాయి. ఇలా చేయడం వల్ల రాత్రి పూట మంచి నిద్ర కూడా వస్తుంది.