Site icon HashtagU Telugu

Vastu tips: రోడ్లపై అలాంటి వాటిని తొక్కుతున్నారా.. అయితే జాగ్రత్త మీరు ప్రమాదంలో పడ్డట్టే?

Mixcollage 31 Jan 2024 05 19 Pm 1517

Mixcollage 31 Jan 2024 05 19 Pm 1517

మామూలుగా వ్యాపారం జరగడం కోసం వ్యాపార స్థలాలలో అనేక రకాల వస్తువులను దిష్టి తగలకుండా పెట్టుకుంటూ ఉంటారు. కొద్ది రోజులు అయిన తర్వాత వాటిని తీసి అక్కడే రోడ్డుపైన పారవేస్తూ ఉంటారు. రోడ్లపై చాలామంది దిష్టి తీసి చాలా వస్తువులు పడేస్తూ ఉంటారు. నిమ్మకాయలు, కోడిగుడ్లు, మిరపకాయలు ఇలా రకరకాల దిష్టి సామాన్లను పడేస్తూ ఉంటారు. అయితే రోడ్డుపైన పడి ఉన్న వాటిని తొక్కినా ఏమీ కాదని హేతువాదులు చెప్తుంటే, కొందరు దిష్టి తీసిన వాటిని తొక్కకూడదు అని చెప్తున్నారు. అనుకోకుండా మనకు తెలియకుండానే కొన్ని కొన్ని సార్లు అలాంటి వస్తువులను మనం తొక్కుతూ ఉంటాం.

చాలా మంది రోడ్డుపై ఏవైనా పడి ఉంటే తొక్కుకుంటూ వెళ్తారు. కొందరు వాటిని దాటుకుంటూ వెళ్తారు. కొందరు అలాంటివి చూస్తేనే వాటికి దూరంగా ఉంటారు. నిజానికి దృష్టి దోషం ఉన్నప్పుడు అది పోవటం కోసం ఉప్పు తిప్పి వేయటం, నిమ్మకాయలు తిప్పి వేయటం, మిరపకాయలు తిప్పి వేయటం వంటివి చేస్తుంటారు. అలా దిష్టి తీసిన వాటిని చాలా మంది రోడ్ల మీద పడేస్తూ ఉంటారు. ఇక వాటిని తొక్కితే ప్రతికూల ఫలితాలు కలుగుతాయని, నెగటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. వాస్తవంగా చెప్పాలంటే రోడ్డుపై పడేసిన దేనిని ముట్టుకోకూడదు. రోడ్డుపై పడి ఉన్న వెంట్రుకలను ఎప్పుడు దాటి వెళ్ళకూడదు.

వాటిని తాక కూడదు. రోడ్డు మీద వెంట్రుకలను దాటి వెళితే అది జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. రోడ్డుపై పడి ఉన్న నిమ్మకాయలు, మిరపకాయలను చూస్తే వాటిని తొక్కకుండా ఉంటేనే మంచిది. ఇక వాటిని తొక్కినా ప్రతికూల ఫలితాలు కలుగుతాయని కొందరు బలంగా విశ్వసిస్తారు. పూజా సామాగ్రి కానీ ఆహారం కానీ రోడ్డు పక్కన లేదా చెట్టు కింద పడి ఉంటే దానిని కూడా తాకకూడదు. ఇప్పుడు బూడిద లేదా కాలిన కలపను ఎక్కడైనా ఉంచినట్లయితే దాటి వెళ్ళకూడదని చెబుతున్నారు. ఎక్కడైనా రోడ్డుపై చనిపోయిన జంతువు కనిపిస్తే దాన్ని చూసిన వెంటనే దిశ మార్చుకొని వెళ్లాలని సూచిస్తున్నారు. అయితే దిష్టి తీసి పడేసిన గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయ తొక్కినా అనుమానం పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. గుమ్మడి కాయ, కొబ్బరికాయ, నిమ్మకాయ మూడు ప్రతికూలతను బయటకు రానివ్వకుండా వాటిలోనే ఉంచుకుంటాయట. బయటకు మంచిని మాత్రమే పంపుతాయని చెబుతున్నారు పండితులు. అసలు రోడ్లపై ఉన్న వస్తువులను తొక్కకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ పొరపాటున తొక్కితే దానికి భయపడాల్సిన అవసరం లేదు.

Exit mobile version