Site icon HashtagU Telugu

Vastu Tips: ఇంట్లో సమస్యలు మాయం అవ్వాలంటే గులాబీ రెక్కలతో ఇలా చేయండి?

Vastu Tips

Vastu Tips

మామూలుగా ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడడం అన్నది సహజం. ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పుడు అరుచుకోవడం కొట్టుకోవడం తిట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ సమస్యలను నివారించడానికి గులాబీ రేకులు ఎంతో బాగా ఉపయోగపడతాయట. గులాబీ రేకులు నెగటివ్ శక్తిని తొలగించి, ఇంటి వాతావరణాన్ని శుభ్రపరుస్తాయని చెబుతున్నారు. గులాబీ రేకుల సువాసన మనసును ప్రశాంతంగా చేసి, ఒత్తిడిని తగ్గిస్తుందట.

అందుకే ఇంట్లో చాలా మంది గులాబీ మొక్కలను పెంచుకుంటారు. అయితే గులాబీ రేకలను ఎలా ఉపయోగించాలి. దీని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గులాబీ రేకులను గాజు గిన్నెలో నీళ్ళు పోసి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల ఇంట్లోని ప్రతికూల వాతావరణం మారుతుందనే నమ్మకం చాలా కాలంగా ప్రజలలో వ్యాపించి ఉంది. అయితే ఒక గాజు గ్లాస్‌ లేదా గిన్నెలో నీరు పోసి అందులోకి గులాబీ రేకలను వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గులాబీ రేకుల నుంచి వచ్చి సువాసన ఇల్ల మొత్తం వ్యాపిస్తుందట.

దీని వల్ల ప్రతికూల వాతావరణం తొలగిపోయి, ఇంట్లో మనశాంతి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా గులాబీ రేకులను పవిత్రమైనవిగా భావించి వాటి నుంచి వచ్చే సుగంధం మానసిక ప్రశాంతతను కలిగిస్తుందని ఇంటిని శుభంగా ఉంచుతుందట. తూర్పు దిశను సూర్యోదయ దిశగా భావించి అది శుభాన్ని తెస్తుందని నమ్ముతారు. తూర్పు దిశలో పూజలు చేయడం దీపాలు వెలిగించడం వంటి ఆచారాలు ఇందుకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రకృతి శక్తులను ఆరాధించే సంస్కృతిలో, ప్రకృతిలో లభించే వస్తువులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గులాబీ రేకులను ప్రకృతి శక్తులకు ప్రతీకగా భావించి, వాటిని ఉపయోగించి పూజలు చేసేవారు. గులాబీ రేకుల సుగంధం మన మానసిక స్థితిని ప్రభావితం చేయడం నిజమే. ప్రకృతితో మనం ఎంత ఎక్కువ సన్నిహితంగా ఉంటే మన మానసిక ఆరోగ్యం అంత మెరుగుపడుతుంది. గులాబీ రేకులను ఉపయోగించడం ద్వారా ప్రకృతితో మన అనుబంధాన్ని పెంచుకోవచ్చు.