Site icon HashtagU Telugu

Goddesses Lakshmi : మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేయాలంటే…ఇల్లును ఇలా శుభ్రం చేయండి..!!

Vastu Tips For House Cleaning

Vastu Tips For House Cleaning

లక్ష్మీదేవి చల్లని చూపున్న ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని అంటుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం లేకుంగా ఎంత డబ్బు సంపాదించినా నిలకడ ఉండదు. అయితే చిన్న చిన్న పొరపాట్లు మాత్రం అస్సలు చేయకూడదు. అలా చేస్తే అమ్మవారికి కోపం వస్తుంది. ముఖ్యంగా లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించాలంటే…ఏం చేయాలి…ఏం చేయకూడదో తెలుసుకుందాం.

ప్రతిరోజూ మనం ఇంటిని చీపురుతో ఊడ్చి..తర్వాత తడి గుడ్డతో శుభ్రం చేస్తాం. ఇల్లు శుభ్రంగా ఉంటేనే కదా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చేది. అయితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి మనల్ని అనుగ్రహించాలంటే…ఇల్లును ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేయకూడదు. ఈ విషయం చాలామందికి తెలియదు కావచ్చు. ఇంటిని శుభ్రం చేసేందుకు ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలోనే ఇంటిని శుభ్రం చేస్తే…లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచివస్తుందని అంటున్నారు పండితులు.

ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి కూడా తిష్టవేసుకుని కూర్చుంటుంది. ఇంటిని శుభ్రపరిచేటప్పుడు…ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఎవరైనా తమ ఇంటిని శుభ్రపరిచేటప్పుడు ప్రధాన ద్వారం నుంచి మొదలుపెట్టి ఇళ్లు మొత్తం శుభ్రం చేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవి ప్రధాన ద్వారం నుంచే ఇంట్లోకి వస్తుంది. అలాగే ఉదయం బ్రహ్మముహూర్తంలో ఎప్పుడూ ఇంటిని ఊడ్చవద్దు. సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చేయవద్దు. సూర్యాస్తమయం తర్వాత శుభ్రం చేయాల్సివస్తే..చెత్తను మాత్రం ఎప్పుడూ బయట పడేయొద్దని పండితులు, పెద్దలు సూచిస్తున్నారు. పొరపాటున అలా చేస్తే..ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది.

ఇక ఇంట్లోని ప్రతి మూల, ఫర్నీచర్ కింద కనిపించే ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి. ఎందుకంటే మూలల్లో దేవతలు ఉంటారని పెద్దలు అంటుంటారు. కేవలం ఇంటిని శుభ్రచేస్తే సరిపోదు. ఇంట్లోని బాత్ రూమ్ లు, టెర్రస్, బాల్కనీని కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. ఇంటిని ప్రతిరోజూ తడిబట్టతో తుడవకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. కేవలం సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం మాత్రమే ఇంటిని శుభ్రం చేయాలి. ఆ రోజుల్లో చేస్తు మిగిలిన దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ విషయాలను గుర్తుంచుకుని ఇంటిని శుభ్రం చేయడం మంచిది.

Exit mobile version