Vastu Tips: పేదరికం దూరమవ్వాలి అంటే ఈ ఇంట్లో ఐదు మొక్కలను పెంచుకోవాల్సిందే?

సాధారణంగా మనం ఎంత కష్టపడి సంపాదించినప్పటికీ ఆర్థిక సమస్యలు తరచుగా వెంటాడుతూనే ఉంటాయి. ఆర్థిక సమస్యలు రావడానికి మానసిక సంస్థలను ఎదు

  • Written By:
  • Publish Date - February 6, 2024 / 09:40 PM IST

సాధారణంగా మనం ఎంత కష్టపడి సంపాదించినప్పటికీ ఆర్థిక సమస్యలు తరచుగా వెంటాడుతూనే ఉంటాయి. ఆర్థిక సమస్యలు రావడానికి మానసిక సంస్థలను ఎదుర్కోవడానికి మనం చేసే చిన్న చిన్న పొరపాటు తప్పులే కారణం కావచ్చు. వాటి నుంచి బయటపడడానికి చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా కష్టాలతో సతమతమవుతుంటే మీ ఇంట్లో ఐదు రకాల మొక్కలను పెంచుకోవాల్సిందే. మరి ఇంట్లో ఎలాంటి మొక్కలను పెంచుకోవాలి అన్న విషయాన్ని వస్తే.. కొన్ని మొక్కలు ఆర్ధిక కష్టాలను తొలగిస్తాయి. ముఖ్యంగా ఇంట్లో 5 చెట్లు ఉంటే ఆ ఇంట్లో నుండి పేదరికం పారిపోతుంది. అలాంటి చెట్లలో ముందు చెప్పాల్సింది మనీ ప్లాంట్.

ఈ మొక్క ఇంట్లో ఉంటే ధనవర్షం కురుస్తుంది. సంపదకు, శ్రేయస్సుకు ఈ మొక్క చాలా ప్రాధాన్యతను ఇస్తుంది. ఈ మొక్క ఎంత వేగంగా పెరుగుతుందో ఇంటికి అంత అదృష్టం కలిసొస్తుంది. ఇంట్లో పెంచుకోవాల్సిన చెట్లలో దానిమ్మ చెట్టు ఒకటి. దానిమ్మ చెట్టును పెంచుకుంటే ఇంటికి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఇంట్లో పెంచుకోవాల్సిన చెట్లలో మరో ముఖ్యమైన చెట్టు వెదురు చెట్టు.వెదురు చెట్టు ఇంట్లో ఉంటే చాలా కలిసొస్తుంది. వెదురు చెట్టుతో సంపద, శ్రేయస్సు కలుగుతుంది. వెదురు చెట్టు ఇంటి ముందు ఉంటే మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఈశాన్య దిశలో ఈ మొక్కను పెంచితే బాగా కలిసొస్తుంది. ఇంట్లో గుమ్మడి చెట్టును పెంచటం కూడా బాగా కలిసొస్తుంది.

ఇంట్లో గుమ్మడి చెట్టును పెంచటం వల్ల జీవితంలో ఆర్ధిక బాధలు తొలగిపోతాయి. ఇంట్లో పెంచుకోవాల్సిన చెట్లలో మారేడు చెట్టు ఒకటి. మారేడు చెట్టు పెంచటం వల్ల శుభాలు కలుగుతాయి. కష్టాలు తొలగిపోతాయి. మత విశ్వాసాల ప్రకారం శివుడు మారేడు చెట్టులో నివసిస్తాడు. మారేడు చెట్టు శివుడికి అత్యంత ప్రీతికరమైనది. కనుక ఇంటిని స్వయంగా శివుడే పర్యవేక్షిస్తాడు అని చెప్తారు. ఈ 5 చెట్లు ఇంట్లో పెంచితే పేదరికం దూరం అవుతుంది.